Home న్యూస్ జాంబి రెడ్డి ట్రైలర్ రివ్యూ….కుమ్మింది ట్రైలర్!!

జాంబి రెడ్డి ట్రైలర్ రివ్యూ….కుమ్మింది ట్రైలర్!!

789
0

 అః సినిమా తో మెప్పించిన ప్రశాంత్ వర్మ తర్వాత చేసిన కల్కి సినిమా తో కూడా మెప్పించినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. కానీ కరోనా టైం లో ప్రశాంత్ వర్మ కొత్త సినిమాను అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు, ఆ సినిమానే జాంబి రెడ్డి, ఇండియాలో మొదటి జాంబి సినిమా అంటూ సినిమాకి మంచి పబ్లిసిటీ కూడా రాగా సినిమా ట్రైలర్ ను రీసెంట్ గా…

రెబల్ స్టార్ ప్రభాస్ తో లాంచ్ చేయించారు… ట్రైలర్ ఓవరాల్ గా అదిరిపోయింది అని చెప్పాలి… కరోనా మొదలు అయిన టైం లో అందరూ ఇళ్ళలోనే ఉంటూ ఉంటె హీరో అండ్ హిస్ బ్యాచ్ మాత్రం బయట తిరుగూ ఉంటారు, ఇలాంటి టైం లో హీరో ఫ్రెండ్ కి పెళ్లి సెట్ అవ్వడంతో….

రాయలసీమకి ప్రయాణం అవుతారు, అక్కడ ఫాక్షనిజం కొత్తగా చూపెడుతూ రొటీన్ గానే సాగిన ట్రైలర్ సడెన్ గా సగం తర్వాత జాంబిల ఎంట్రీ తో డిఫెరెంట్ గా మారిపోతుంది, ఒక కమర్షియల్ మూవీ లో జాంబిలు ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ తో మంచి కామెడీ..

ఎలిమెంట్స్ తో జాంబి ట్రైలర్ సర్ప్రైజింగ్ గా బాగానే మెప్పించింది అని చెప్పాలి, మరీ హర్రర్ ఎలిమెంట్స్ ఏమి లేవు అనుకుంటున్న టైం లో ట్రైలర్ ఎండ్ బిట్ కొంచం భయం కలిగించేలా ఉండగా ప్రతీ సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సారి జాంబిలు వస్తున్నాయి అంటూ డైలాగ్ తో ట్రైలర్ ముగించడం జరిగింది.. దాంతో సినిమా కూడా ఇప్పుడు సంక్రాంతి రేసులో ఎంటర్ కానుందని…

కన్ఫాం చేశారు… ఓవరాల్ గా ట్రైలర్ చాలా బాగా మెప్పించింది అని చెప్పాలి, కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు జాంబి కాన్సెప్ట్ కొత్తగా ఉండటం తో సినిమా కి కలిసి వచ్చే అంశం అనే చెప్పాలి, సినిమా కూడా ట్రైలర్ లా మెప్పిస్తే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బాగానే వర్కౌట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here