బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమా, లాస్ట్ ఇయర్ రైటర్ పద్మభూషణ్ లాంటి హిట్స్ ను అందుకున్న యంగ్ హీరో సుహాస్(Suhas) వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండగా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు దసరా కానుకగా నటించిన జనక అయితే గనక(Janaka Aithe Ganaka Movie Review) తో వచ్చేశాడు. మరి ఈ సినిమాతో ఎంతవరకు మెప్పించాడో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే సాధారణ మిడిల్ క్లాస్ వ్యక్తి అయిన హీరో నార్మల్ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉండగా అన్ని కటింగ్స్ పోను నెలకు 23 వేల జీతం మాత్రమే వస్తూ ఉండటంతో ఇలాంటి పరిస్థితులలో తనకి పిల్లలు వద్దూ అనుకుంటాడు…కానీ అనుకోకుండా తన భార్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో….
ఎంజాయ్ అనే కండోమ్ తయారు చేసే కంపెనీ మీద కేసు వేస్తాడు…ఆ తర్వాత కథ ఏం అయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…కథ పాయింట్ కొంచం యూనిక్ గా ఉండగా ఫ్యామిలీ ఎలిమెంట్స్ ను డైరెక్టర్ సినిమాలో బాగానే మిక్స్ చేశాడు….పెర్ఫార్మెన్స్ పరంగా సుహాస్…
మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకాగా హీరోయిన్ పర్వాలేదు అనిపించింది, వెన్నల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు అనిపించగా సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు ఆకట్టుకుంది..
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నా అక్కడక్కడా డ్రాగ్ అయింది, సెకెండ్ ఆఫ్ లో సీన్స్ కొంచం రిపీటివ్ గా కొంచం ఎక్కువ లెంత్ తో అనిపించాయి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకోగా, డైరెక్టర్ చెప్పిన పాయింట్ బాగున్నా కొంచం ఎక్కువగానే సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు అనిపించింది…
సెకెండ్ ఆఫ్ లో మెలో డ్రామా కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగినా క్లైమాక్స్ మళ్ళీ వెన్నెల కిషోర్ కామెడీ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. ఓవరాల్ గా సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వచ్చే అవకాశం ఉంది…
ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, మిడిల్ క్లాస్ వాళ్ళు తమని రిలేట్ చేసుకునేలా ఉన్న సీన్స్ కొన్ని ఆకట్టుకోవడం, కామెడీ పార్టుపార్టులుగా వర్కౌట్ అవ్వడం అలాగే పిల్లల ఫీజులు ఎలా ఉంటున్నాయి లాంటి వాటి మీద చేసిన కామెంట్స్ లాంటివి ప్లస్ పాయింట్స్ అవ్వడంతో….
పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి వచ్చేలా మెప్పించింది ఈ సినిమా…మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…