Home న్యూస్ 24 గంటలు ఓవర్…..విజయ్ ‘జన నాయగన్’ రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

24 గంటలు ఓవర్…..విజయ్ ‘జన నాయగన్’ రెస్పాన్స్ ఎలా ఉందంటే!!

0

సోషల్ మీడియా రికార్డుల విషయంలో ఎప్పుడూ కూడా కోలివుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన సినిమాల రికార్డులు టాప్ లో ఉంటాయి…ట్రైలర్ ల విషయంలో ముఖ్యంగా లైక్స్ విషయంలో విజయ్ రికార్డులను ఇప్పటికీ ఇతర సినిమాలు ఏవి కూడా అందుకోలేదు. ఇక లేటెస్ట్ గా విజయ్ పుట్టిన రోజు కానుకగా…

తన లాస్ట్ మూవీ అయిన జన నాయగన్(#JanaNayaganTheFirstRoar) సినిమా గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు. రాత్రి 12 గంటల టైంకి గ్లిమ్స్ ను రిలీజ్ చేయగా ఆడియన్స్ అప్పుడు కూడా ఎగబడి చూసి సాలిడ్ వ్యూవర్ షిప్ సొంతం అయ్యేలా చేశారు….ఇక ఈ సినిమా ముందు నుండి కూడా…

నట సింహం బాలయ్య(Balakrishna) చేసిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమా రీమేక్ అంటూ వార్తలు రాగా ఇప్పుడు గ్లిమ్స్ చూస్తుంటే ఆల్ మోస్ట్ ఇదే నిజం అనిపించింది కూడా…సీన్స్ ఆల్ మోస్ట్ అవే రిపీట్ చేసినట్లు గ్లిమ్స్ లో చూపించారు…

ఈ సారి ఎందుకో అనిరుద్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా మరీ ఇంపాక్ట్ ఫుల్ గా అనిపించలేదు…కానీ విజువల్స్ పరంగా కానీ విజయ్ లుక్స్ అండ్ హీరోయిజం కానీ గ్లిమ్స్ లో ఎక్స్ లెంట్ గా మెప్పించడంతో కోలివుడ్ వరకు గ్లిమ్స్ కి ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా…

మన వాళ్ళకి ఇది కాపీ పేస్ట్ లానే అనిపించింది. ఇక 24 గంటల్లో ఈ గ్లిమ్స్ కి ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి…వ్యూస్ పరంగా 22.57 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని ఇండియన్ టాప్ గ్లిమ్స్ రికార్డులలో…

ఆల్ టైం టాప్ 5 ప్లేస్ ను సొంతం చేసుకోగా లైక్స్ పరంగా 770K లైక్స్ మార్క్ ని అందుకుని ఇండియన్ టాప్ గ్లిమ్స్ లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని మంచి రచ్చ చేసింది. ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here