కోలివుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరైన కార్తీ(Karthi) నటించిన 25వ సినిమా అయిన జపాన్(Japan Movie) ఆడియన్స్ ముందుకు దీపావళి కానుకగా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మంచి బజ్ నే సొంతం చేసుకుంటూ ఉండగా….
సినిమా బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపిస్తుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 6 కోట్ల దాకా ఉంటుందని అంచనా… దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో అటూ ఇటూగా….
6.50 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది… ఇక సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 40 కోట్ల దాకా ఉంటుందని అంచనా…దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద సినిమా 41 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా 80 కోట్ల రేంజ్ కి అటూ ఇటూగా…
గ్రాస్ ను సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. తమిళ్ లో పోటి వలన బిజినెస్ కొంచం తగ్గింది కానీ సోలో రిలీజ్ అయ్యి ఉంటే సినిమా భారీ బిజినెస్ తో రచ్చ చేసేది, ఓవరాల్ గా పోటిలో కూడా భారీ బిజినెస్ ను సొంతం చేసుకున్న జపాన్ మూవీ…
తెలుగు లో ఏమాత్రం డీసెంట్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్స్ తో జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. లాస్ట్ ఇయర్ సర్దార్ తో భారీ హిట్ ను అందుకున్న కార్తీ ఈ సినిమాతో ఆ విజయాన్ని మించిన విజయాన్ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి ఇక…