బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ పాండమిక్ తర్వాత వరుస పెట్టి సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి, తెలుగు రాష్ట్రాలలో ఊహకందని కలెక్షన్స్ ని అన్ని సినిమాలు సొంతం చేసుకున్నాయి, కానీ ఓవర్సీస్ లో మాత్రం కొన్ని సినిమాలే ఎంతో కొంత కలెక్షన్స్ ను సాధించాయి. అక్కడ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఇయర్ మొదట్లోనే ఉండగా ఈ సారి థియేటర్స్ లో ఆక్యుపెన్సీ ని అక్కడ చాలా తగ్గించారు. అయినా కానీ క్రాక్, ఉప్పెన లాంటి సినిమాలు…
పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించగా మార్చ్ లో వచ్చిన జాతిరత్నాలు సినిమా మాత్రం తక్కువ లోకేషన్స్ లోనే రిలీజ్ అయ్యి ఊహకందని కలెక్షన్స్ ని తక్కువ ఆక్యుపెన్సీ తోనే సొంతం చేసుకుంది టోటల్ రన్ లో అమెరికాలో 1 మిలియన్ మార్క్ ని దాటేసింది.
ఇండియా నుండి ఈ మార్క్ ని పాండమిక్ తర్వాత అందుకున్న మొట్ట మొదటి సినిమాగా నిలిచింది. ఈ రికార్డ్ ను పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా బ్రేక్ చేసి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది అని అంతా అనుకున్నారు, ఆక్యుపెన్సీ కూడా జాతిరత్నాలు లెవల్ లోనే పెట్టారు…
లొకేషన్ కౌంట్ భారీగా పెంచడం జరిగింది, దాంతో ఓవర్సీస్ లో పాత రోజులు రాబోతున్నాయి అనుకున్నారు కానీ సినిమా సూపర్ స్టార్ట్ తర్వాత స్లో అయ్యి ఫైనల్ గా ఇప్పటి వరకు అమెరికాలో $750K డాలర్స్ తోనే సరిపెట్టుకుంది, అమెరికాలో బ్రేక్ ఈవెన్ కి 1.3 మిలియన్ మార్క్ ని అందుకోవాలి… ఎందుకంటే రిలీజ్ అయిన లోకేషన్స్ ఎక్కువ కాబట్టి… థియేటర్స్ నుండి వచ్చిన రెవెన్యూలు టాక్సులు థియేటర్స్ మెయిన్ టైన్స్ లాంటివి తీసేయగా…
షేర్ తక్కువ వస్తుంది.. జాతిరత్నాలు తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యి షేర్ ఎక్కువ సాధించింది, కానీ వకీల్ సాబ్ కి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ అక్కడ కూడా ఉన్నప్పటికీ కానీ ఇది పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ కాబట్టి ఆ మార్క్ ని అవలీలగా అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ అలా జరగలేదు… దాంతో ప్రస్తుతానికి అమెరికాలో 1 మిలియన్ ని అందుకున్న ఓకే ఒక్క సినిమాగా జాతిరత్నాలు కొనసాగుతుంది.