Home న్యూస్ చరిత్ర సృష్టించిన జాతిరత్నాలు రత్నాలు…ఇండియా లోనే ఇది మొట్ట మొదటి సినిమా!

చరిత్ర సృష్టించిన జాతిరత్నాలు రత్నాలు…ఇండియా లోనే ఇది మొట్ట మొదటి సినిమా!

3537
0

పాండమిక్ తర్వాత ఆల్ ఇండియా లో వరుస విజయాలతో దుమ్ము దుమారం చేసిన ఏకైక ఇండస్ట్రీ తెలుగు ఇండస్ట్రీ అని చెప్పొచ్చు. ఇంకా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ అవ్వాల్సి ఉంది కానీ ఈ లోపు వచ్చిన కొన్ని సినిమాలు అల్టిమేట్ విజయాలను నమోదు చేయగా మిగిలిన ఇండస్ట్రీలు కూడా అడపాదడపా హిట్స్ కొడుతున్నా టాలీవుడ్ కొట్టినంత రెట్టింపు జోరు తో అయితే ఎవ్వరూ మూవీస్ చూడటానికి ఎగబడటం లేదనే చెప్పాలి.

Jathi Ratnalu 10 Days Total World Wide Collections

ఇక సమ్మర్ కన్నా ముందే అన్ సీజన్ టైం లో జాతిరత్నాలు అనే చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనాలను సృష్టిస్తూ బిజినెస్ మీద భారీ లాభాలను సొంతం చేసుకుంటున్న మూవీస్ లో ఒకటిగా నిలుస్తూ దూసుకు పోతూ ఉండగా…

Jathi Ratnalu 11 Days Total World Wide Collections

నాన్ స్టాప్ గా 12 రోజుల పాటు కోటి కి తగ్గ షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న ఈ సినిమా, ఇప్పుడు అమెరికాలో మరో అరుదైన రికార్డ్ ను సాధించింది, పాండమిక్ తర్వాత అక్కడ 1 మిలియన్ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి ఇండియన్ మూవీ గా నిలిచింది.

Jathi Ratnalu 12 Days Total World Wide Collections

ఇండియా నుండి అమెరికాలో రిలీజ్ అయిన అన్ని మూవీస్ లో మాస్టర్ మూవీ ఒక్కటే అక్కడ 4 లక్షల కి పైగా డాలర్స్ ను సొంతం చేసుకోగా ఆ రికార్డ్ ను వీకెండ్ కే సొంతం చేసుకున్న ఈ సినిమా లాంగ్ రన్ ని సొంతం చేసుకుని ఇప్పుడు అక్కడ ఏకంగా 1 మిలియన్ మార్క్ ని 15 రోజుల టైం లోనే సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.

Jathi Ratnalu 13 Days Total World Wide Collections

దాంతో అఫీషియల్ గా ఇప్పుడు మొట్ట మొదటి 1 మిలియన్ మూవీ గా పాండమిక్ తర్వాత సంచలనం సృష్టించింది, ఇక టాలీవుడ్ నుండి వరుస పెట్టి క్రేజీ మూవీస్ రిలీజ్ కాబోతున్న నేపధ్యంలో అప్ కమింగ్ డేస్ లో మరిన్ని అద్బుతాలు అమెరికాలో జరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ సినిమా ఆల్ మోస్ట్ రన్ ని అక్కడ ముగించబోతుందని సమాచారం.

Jathi Ratnalu 14 Days Total World Wide Collections

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here