Home న్యూస్ జవాన్ ట్రైలర్ రివ్యూ….SRK మాస్…మరో 500 కోట్లు పక్కా!

జవాన్ ట్రైలర్ రివ్యూ….SRK మాస్…మరో 500 కోట్లు పక్కా!

0

బాలీవుడ్ బాద్ షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) అట్లీల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున వస్తున్న కొత్త సినిమా జవాన్(Jawan Movie)… ఈ ఇయర్ పఠాన్(Pathaan) మూవీ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్…

ఈ సినిమాతో మరోసారి రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు అయితే ఉన్నాయని చెప్పాలి. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ట్రైలర్ చూస్తుంటే….

సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి. యాక్షన్, సెంటిమెంట్, హీరోయిజం, గ్రాండియర్, ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా ట్రైలర్ మొత్తం ఒక పక్కా మాస్ కమర్షియల్ మూవీ లో ఏమైతే ఉంటాయో…

ఆడియన్స్ కావాలో అవన్నీ ఫుల్ ప్యాకుడ్ గా ఇందులో పెట్టేశాడు…ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ మూవీగా రూపొందుతున్న జవాన్ మూవీ ఆడియన్స్ ముందుకు సెప్టెంబర్ 7న వరల్డ్ వైడ్ గా భారీ గా రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అందులో…

కింగ్ ఖాన్ మాస్ హీరోయిజం అండ్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ విలనిజం చూస్తూ ఉంటే అవలీలగా మరో 500 కోట్లకు తగ్గని నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందీ అనిపించేలా ఈ ట్రైలర్ మెప్పించింది. ఇక ట్రైలర్ కి 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here