Home గాసిప్స్ జెర్సీ రీమేక్ కి షాయిద్ కపూర్ షాకింగ్ రెమ్యునరేషన్!!

జెర్సీ రీమేక్ కి షాయిద్ కపూర్ షాకింగ్ రెమ్యునరేషన్!!

0

బాలీవుడ్ లో హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా మంచి యాక్టర్స్ లో ముందు నిలిచే హీరో షాయిద్ కపూర్ అని చెప్పాలి. ఎప్పుడో కెరీర్ ని మొదలు పెట్టినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర కరెక్ట్ బ్లాక్ బస్టర్ కోసం ఏళ్ళ కి ఏళ్ళు ఎదురు చూసిన ఈ హీరోకి ఎట్టకేలకు టర్నింగ్ పాయింట్ లాస్ట్ ఇయర్ అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ తో దక్కింది.

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహలకు అందని రేంజ్ విజయాన్ని నమోదు చేసుకుని టోటల్ రన్ లో ఇండియా లో 278 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా 370 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుని బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది….

అలాంటి విజయం అందుకున్న సినిమా కిషాయిద్ అందుకున్న రెమ్యునరేషన్ 22 కోట్లు, తర్వాత లాభాల్లో కొద్దిగా ప్రాఫిట్ షేర్ దక్కిందట. కానీ ఇప్పుడు నాని కెరీర్ లో వన్ ఆఫ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ లో ఒకటైన జెర్సీ సినిమాను అదే పేరుతో హిందీ లో రీమేక్ చేస్తున్న షాయిద్ కపూర్ ఈ సినిమా కి మాత్రం…

సాలిడ్ గా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. ఆల్ మోస్ట్ కబీర్ తో పోల్చుకుంటే డబుల్ రెమ్యునరేషన్ ని ఈ సినిమా కోసం తీసుకుంటున్నాడట… 42 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు సినిమా ప్రాఫిట్ లో 10% షేర్ కూడా షాయిద్ కి వెళ్ళబోతుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్ కొంతభాగం జరిగినప్పటికీ కరోనా వలన షూటింగ్ ఆగి పోగా ఇంకా మొదలు కాలేదు.

వచ్చే ఏడాది సమ్మర్ లో అనుకున్నారు కానీ ఇప్పుడు సెకెండ్ ఆఫ్ లో కబీర్ సింగ్ రిలీజ్ టైం కి సినిమాను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా తో మరో సారి కబీర్ సింగ్ రేంజ్ హిట్ కొడితే తన రేంజ్ మరింత పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here