Home న్యూస్ జిగర్ తండ2 తెలుగు-తమిళ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

జిగర్ తండ2 తెలుగు-తమిళ్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 2019 టైంలో వరుణ్ తేజ్(Varun Tej) హీరోగా తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా ఒరిజినల్ వర్షన్ జిగర్ తండ(Jigar thanda) సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు వస్తున్న కొత్త సినిమా జిగర్ తండ డబుల్ ఎక్స్(Jigar thanda Double X ) సినిమాలో ఈ సారి మెయిన్ లీడ్ లో….

రాఘవ లారెన్స్(Raghava Lawrence) మరియు SJ సూర్య నటిస్తూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించగా ఓవరాల్ గా మొదటి పార్ట్ నే చాలా వరకు గుర్తు చేసేలా ఉండగా ఇప్పుడు సినిమా వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవుతుంది…

తెలుగు లో లారెన్స్ రీసెంట్ మూవీ చంద్రముఖి2 ఫ్లాఫ్ ఇంపాక్ట్ కొంచం ఉండగా జపాన్(Japan Movie) నుండి కూడా పోటి ఉండటంతో ఓవరాల్ గా జిగర్ తండ2 సినిమా 350 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా తెలుగు వాల్యూ బిజినెస్ రేంజ్ 5 కోట్ల దాకా ఉంటుందని అంచనా…

సినిమా తెలుగు లో 5.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే హిట్ అవుతుంది. ఇక సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ 35 కోట్ల దాకా ఉంటుందని అంచనా… సినిమా వరల్డ్ వైడ్ గా 36 కోట్ల రేంజ్ లో షేర్ ని 70 కోట్లకు పైగా గ్రాస్ ను సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంటుంది.

సినిమాకి టాక్ పాజిటివ్ గా వస్తే మొదటి పార్ట్ హైప్ కలిసి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద ఎలాంటి కలెక్షన్స్ తో అంచనాలను అందుకుని పోటిలో టార్గెట్ ను అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here