Home న్యూస్ జిగర్ తండ2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

జిగర్ తండ2 రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ లో రాఘవ లారెన్స్(Raghava Lawrence) మరియు SJ సూర్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ జిగర్ తండ డబుల్ ఎక్స్(Jigar thanda Double X ) సినిమా భారీ లెవల్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మొదటి పార్ట్ తమిళ్ లో సూపర్ హిట్ గా రెండో పార్ట్ మొదటి పార్ట్ తో సంభందం లేదు కానీ ఎంతవరకు సీక్వెల్ మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే చేయని తప్పుకు జైలులో ఉండే SJ సూర్య ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ఒక హత్య చేయాల్సి ఉంటుంది, ఆ హత్య సీజర్ అనే గ్యాంగ్ స్టర్ అయిన రాఘవ లారెన్స్ ను చంపాల్సి ఉంటుంది, మరి SJ సూర్య ఈ హత్య చేశాడా లేదా…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మొత్తం మీద సినిమా అని చెప్పాలి…

మొత్తం మీద జిగర్ తండ2 ఒక టికెట్ మీద 2 సినిమాలు అనిపించేలా ఉంటుంది, ఫస్టాఫ్ ఒక సినిమాలా అలాగే రెండో హాల్ఫ్ మరో సినిమాలా అనిపిస్తుంది… ఫస్టాఫ్ లో కథ టేక్ ఆఫ్ అవ్వడానికి చాలా టైం పట్టగా స్లో నరేషన్ తో అక్కడక్కడా కొంచం ఆసక్తిని పెంచిన సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ పర్వాలేదు అనిపించగా…

సెకెండ్ ఆఫ్ లో కథ బ్యాగ్ డ్రాప్ అడవికి షిఫ్ట్ అయ్యి మరో విలన్ ఎంటర్ అవ్వడం, కథ పొలిటికల్ టర్న్ కూడా తీసుకున్న తర్వాత కొంచం పడుతూ లేస్తూ సాగినా ఫస్టాఫ్ కన్నా బెటర్ గా అనిపిస్తూ ప్రీ క్లైమాక్స్ నుండి క్లైమాక్స్ ఎపిసోడ్ లు బాగానే మెప్పించి ఓవరాల్ గా డీసెంట్ మూవీ అనిపిస్తుంది ఈ సినిమా….

రాఘవ లారెన్స్ కానీ ఎస్ జే సూర్య కానీ తమ రోల్స్ లో అద్బుతంగా నటించి మెప్పించగా నవీన్ చంద్ర కూడా తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు, మిగిలిన రోల్స్ జస్ట్ ఓకే అనిపించగా సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా మాత్రం చాలా స్లో నరేషన్ తో సాగిన సినిమాలో…

ఈజీగా 20-25 నిమిషాల రన్ టైం ని కట్ చేసి ఉంటే సినిమా ఇంకా బెటర్ స్క్రీన్ ప్లే తో మెప్పించి ఉండేది… ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉండగా కార్తిక్ సుబ్బరాజ్ డైరెక్షన్ చాలా వరకు అంచనాలకు తగ్గట్లు మెప్పించింది అని చెప్పాలి కానీ అదే టైములో సినిమాకి రన్ టైం బిగ్ మైనస్ అని చెప్పాలి…

అలాగే ఫస్టాఫ్ టేక్ ఆఫ్ కి చాలా టైం పట్టడం మరో మేజర్ డ్రా బ్యాక్ అని చెప్పాలి. మొత్తం మీద ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ కొంచం ఓపిక పట్టి చూస్తె సినిమా చాలా వరకు మెప్పించే అవకాశం ఉంది, కానీ అదే టైంలో రెగ్యులర్ ఆడియన్స్ కూడా కొంచం లెంత్ ని బరిస్తే….

మొత్తం మీద సినిమా పర్వాలేదు అనిపించవచ్చు…. ఓవరాల్ గా సినిమా జిగర్ తండ1 రేంజ్ లో కాకపోయినా కూడా ఉన్నంతలో బాగానే ఆకట్టుకుంది అని చెప్పొచ్చు. ముందే చెప్పినట్లు స్లో నరేషన్ ఇబ్బంది పెట్టకుండా ఉంటే సినిమా ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు. మొత్తం మీద సినిమా కి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here