Home న్యూస్ ఆలియా భట్ జిగ్రా మూవీ 1st వీక్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

ఆలియా భట్ జిగ్రా మూవీ 1st వీక్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ దసరా కానుకగా బాలీవుడ్ లో భారీ లెవల్ లో రిలీజ్ అయిన మూవీస్ లో బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన ఆలియా భట్(Alia Bhatt) మెయిన్ లీడ్ లో నటించిన కొత్త సినిమా జిగ్రా(Jigra Movie) భారీగా ఆడియన్స్ ముందుకు రాగా, మిక్సుడ్ రెస్పాన్స్ నే ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న సినిమా…

పెద్దగా జోరుని కలెక్షన్స్ పరంగా చూపించ లేక పోయింది. సినిమా మొదటి వీకెండ్ లో దసరా టైంలో పర్వాలేదు అనిపించిన సినిమా 3 రోజుల దసరా వీకెండ్ లో 16.64 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకున్న సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో…

వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా 5.76 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా ఓవరాల్ గా మొదటి వారంలో సినిమా మొత్తం మీద ఇప్పుడు 22.40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని మాత్రమే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది…

సినిమాకి టాక్ డీసెంట్ గానే ఉన్న అకూడా కలెక్షన్స్ పరంగా మాత్రం ఏమాత్రం జోరుని చూపించ లేక పోయిన మొదటి వారమే చేతులు ఎత్తేసింది. సినిమా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 65-70 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవాల్సి ఉంటుందని అంచనా…

కానీ సినిమా ఆ మార్క్ ని అందుకునే అవకాశం ఇప్పుడు కష్టంగానే కనిపిస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీక్ లో సూపర్ గ్రోత్ ని చూపించక పోతే మాత్రం ఫ్లాఫ్ గానే నిలిచే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక రెండో వీక్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here