ఎన్టీఆర్ డిసాస్టర్ సినిమా అక్కడ రీమేక్!

0
1125

     యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఇప్పటివరకు చేసిన సినిమాలు 28. అందు లో ప్రేక్షకుల ను అలరించిన సినిమాలు అలాగే అస్సలు ఆకట్టు కోలేని సినిమాలు ఉన్నాయి. ఈ రెండో కోవకి చెందిన సినిమా ఒక్కటి ఇప్పుడు మరో భాషలో రీమేక్ కాబో తుంద౦టూ టాలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. మరి ఆ సినిమా ఏంటో తెలుసు కుందాం పదండి. 2013 లో అత్యంత భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఎన్టీఆర్-హరీష్ శంకర్ ల

“రామయ్యావస్తావయ్యా” సినిమా ప్రేక్షకులను ఎంత నిరాశపరిచిందో కొత్తగా చెప్పాల్సిన పనేముంది. ఫస్టాఫ్ చూసి ఎన్టీఆర్ కి ఓ రేంజ్ హిట్ పడటం ఖాయం అనుకున్న వారికి సెకెండాఫ్ లో ఎన్టీఆర్ అంతకుముందు చేసిన “నరసింహుడు” సినిమానే మార్చి చేసి బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిపాడు హరీష్ శంకర్.

కాగా ఈ సినిమా డిసాస్టర్ టాక్ తోనూ 30 కోట్లకు పైగా షేర్ సాధించినా టోటల్ గా మాత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ డిసాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. ఇలాంటి సినిమాను కన్నడలో త్వరలో ఓ స్టార్ హీరో రీమేక్ చేయబోతున్నట్లు టాక్.

శివ కుమార్ లేక పునీత్ రాజ్ కుమార్ లలో ఒకరు ఈ సినిమా రీమేక్ చేసే అవకాశం ఉండని అంటున్నారు. ఫస్టాఫ్ కథను అలాగే ఉంచి సెకెండాఫ్ స్టోరీని మార్చితే మంచి విజయం సాధించే ఛాన్స్ ఉందని ఆ హీరో భావిస్తున్నాడట.

మరి రీమేక్ చేసే హీరో పేరు ఇంతవరకు బయటకు రాలేదు కాని త్వరలో అన్ని విషయాలు తెలియనున్నాయి అంటున్నారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న RRR లో బిజీ గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా 2020 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!