యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా రీమేక్ ని ఓకే చేసిన బాలీవుడ్ హీరో

0
1169

  సౌత్ రీమేక్ లు అందునా టాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల రీమేక్ లను ఎక్కువగా ఇష్టపడే బాలీవుడ్ హీరోలు ఎందుకనో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలను మాత్రం టచ్ చేయలేరు… ఎన్టీఆర్ నటనతో కంపేర్ చేస్తారు అని వాటిని రీమేక్ చేయకుండా ఉంచుతారని టాక్ ఉన్నా దాన్ని పైకి మాత్రం ఒప్పుకోరు ఎవరు. కానీ రీసెంట్ గా టెంపర్ రీమేక్ అక్కడ మంచి సక్సెస్ అవ్వడం తో మిగిలిన సినిమా ల పై పడ్డారనే టాక్ ఉంది..

కాగా ఇప్పుడు బాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్ ప్రతిష్టాత్మక 25 వ సినిమా నాన్నకుప్రేమతో అక్కడ రీమేక్ కి సిద్ధమవుతుంది అన్న టాక్ గట్టిగానే వినిపిస్తుంది, టెంపర్ రీమేక్ అక్కడ 230 కోట్లకు పైగా వసూళ్లు అందుకోవడం తో ఈ రీమేక్ కూడా పక్కా అనే టాక్ వినిపిస్తుంది.

బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ ఎన్టీఆర్ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కెరీర్ ఒకప్పుడు పీక్ లో దూసుకెళ్లిన రణబీర్ ఇప్పుడు వరుస ఫ్లాఫుల్లో ఉండగా రీసెంట్ గా సంజు తో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చాడు. నాన్నకుప్రేమతో లాంటి క్లాస్ మూవీతో మరోసారి సత్తా చాటే చాన్స్ ఉందని సమాచారం, కరణ్ జోహార్ ఈ సినిమా ను నిర్మించే చాన్స్ ఉందని తెలుస్తుంది.. మరి ఈ మాటల్లో ఎంత నిజముందో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తేనే తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!