Home న్యూస్ 2 నెలల్లో ఇదే బెస్ట్….బాక్స్ ఆఫీస్ ఊచకోత ఇది!!

2 నెలల్లో ఇదే బెస్ట్….బాక్స్ ఆఫీస్ ఊచకోత ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర జూన్ 3న రిలీజ్ అయిన మేజర్ మరియు విక్రమ్ మూవీస్ మంచి విజయాలుగా నిలిచాయి. తర్వాత వచ్చిన సినిమాల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అనుకున్న రేంజ్ లో అయితే రచ్చ చేయలేదు. ఉన్నంతలో ది వారియర్ ఒక్కటి పర్వాలేదు అనిపించగా మిగిలిన సినిమాలు ఏవి కూడా ఇంపాక్ట్ ని చూపించలేదు. ఇలాంటి టైం లో టాలీవుడ్ సరైన సినిమాల కోసం….

ఎదురు చూస్తున్న తరుణంలో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు బింబిసార మరియు సీతా రామం సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు నెలలుగా థియేటర్స్ కి రావాలా వద్దా అంటూ ఆగిపోయిన సినీ లవర్స్ ఇప్పుడు ఈ సినిమాలు చూడటానికి థియేటర్స్ కి మొదటి రోజే భారీ లెవల్ లో…

వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ముఖ్యంగా మాస్ తో పాటు అన్ని వర్గాలను ఆకట్టుకునేలా మెప్పించిన బింబిసార ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ దూసుకు పోతుంది. ఇక క్లాస్ సెంటర్స్ లో సీతా రామం సినిమా మంచి హోల్డ్ ని చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

బి సి సెంటర్స్ లో బింబిసారను టచ్ చేయడం కష్టంగానే ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో అలాగే ఏ సెంటర్స్ లో సీతా రామం మంచి జోరు చూపిస్తుంది. మొత్తం మీద ఇప్పుడు ఈ రెండు సినిమాల ఫస్ట్ డే అన్ని షోలు చూస్తుంటే… గత 2 నెలల్లో బెస్ట్ డే ఇదే నని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉండటం విశేషం అని చెప్పాలి…

మేజర్ మరియు విక్రమ్ మూవీస్ తర్వాత మళ్ళీ పోటిలో ఒకే రోజు వచ్చిన ఈ సినిమాలు వేటికవే డిఫెరెంట్ ఆడియన్స్ ను టార్గెట్ చేసినా పాజిటివ్ టాక్ తో జనాలను తిరిగి థియేటర్స్ కి రప్పిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోయడానికి సిద్ధం అవుతున్నాయి. వీకెండ్ లో ఈ సినిమాలు ఎలాంటి వసూళ్లు కురిపిస్తాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here