Home న్యూస్ ఒక్క రోజు దెబ్బ…కెరీర్ లో టాప్ 2 కొట్టిన అఖిల్!!

ఒక్క రోజు దెబ్బ…కెరీర్ లో టాప్ 2 కొట్టిన అఖిల్!!

6043
1

అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దుమ్ము లేపుతుంది. సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు కూడా స్ట్రాంగ్ రన్ ని కొనసాగిస్తూ అల్టిమేట్ అనిపించే రేంజ్ లో హోల్డ్ ని సొంతం చేసుకుని పరుగును రాబడుతూ ఉండగా సినిమా ఓవర్సీస్ లో కూడా ఇదే రేంజ్ లో కుమ్మేస్తుంది…

సినిమా ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అలాగే మొదటి రోజు కలెక్షన్స్ తో $225K మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా రెండో రోజు సాధించిన కలెక్షన్స్ తో సినిమా $350K మార్క్ ని అందుకుందని సమాచారం. అంటే ఇండియన్ కరెన్సీ లో గ్రాస్ కలెక్షన్స్ లెక్క ఆల్ మోస్ట్…

2.68 కోట్ల రేంజ్ లో ఉంటుంది… సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ తో అక్కడ కుమ్మేయగా అఖిల్ కెరీర్ లోనే ఇప్పుడు సినిమా సెకెండ్ హైయెస్ట్ గ్రాసర్ గా అమెరికాలో సంచలన కలెక్షన్స్ తో దుమ్ము లేపింది… ఇది వరకు అఖిల్ నటించిన సినిమాల్లో హలో సినిమా టోటల్ రన్ లో…

1 మిలియన్ మార్క్ ని అందుకోగా తర్వాత మిస్టర్ మజ్ను $221k మార్క్ ని అఖిల్ సినిమా $168K మార్క్ ని అందుకున్నాయి. దాంతో ఇప్పుడు జస్ట్ ఫస్ట్ డే నే సాధించిన కలెక్షన్స్ తో అమెరికాలో తన కెరీర్ లోనే టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకున్న అఖిల్ ఇప్పుడు తన కెరీర్ బెస్ట్ నంబర్స్ ను లాంగ్ రన్ లో సొంతం చేసుకునే అవకాశం…

ఎంతైనా ఉందని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా లాంగ్ రన్ లో ఎలా జోరు చూపుతుంది అన్నది వర్కింగ్ డేస్ హోల్డ్ ని బట్టి చెప్పగలం. మొత్తం మీద అఖిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి కమర్షియల్ సక్సెస్ ను అందుకోవడానికి అన్ని అవకాశాలు ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి…

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here