Home న్యూస్ జస్ట్ కోటి తేడాతో మాస్టర్ రికార్డ్ ను మిస్ అయిన సూర్యవంశీ!!

జస్ట్ కోటి తేడాతో మాస్టర్ రికార్డ్ ను మిస్ అయిన సూర్యవంశీ!!

952
0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వరుస పెట్టి సినిమాల రిలీజ్ లతో అన్ని ఇండస్ట్రీలు దుమ్ము లేపగా బాలీవుడ్ లేట్ గా తేరుకుని సినిమాలను రిలీజ్ చేసే టైం కి మళ్ళీ సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వగా అప్పటికి ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది విజయ్ నటించిన మాస్టర్ మూవీ… ఎట్టకేలకు ఇప్పుడు తేరుకున్న బాలీవుడ్ దీపావళికి బిగ్ రిలీజ్ సూర్యవంశీని రిలీజ్ చేయగా సినిమా ఇప్పుడు…

Master 2 Weeks Total World Wide Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర 50% ఆక్యుపెన్సీతో మహారాష్ట్రలో రిలీజ్ అవ్వగా చాలా చోట్ల 50% ఆక్యుపెన్సీనే ఉంది. అయినా కానీ మొదటి రోజు నుండే సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన ఈ సినిమా మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి ఇండియాలో 120.85 కోట్ల నెట్ కలెక్షన్స్ ని…

143.5 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 180.5 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పాండమిక్ తర్వాత బాలీవుడ్ నుండి బిగ్గెస్ట్ రికార్డ్ ను నమోదు చేసింది, సినిమా ఊపు చూసి మొదటి వారం విజయ్ మాస్టర్ కలెక్షన్స్ రికార్డ్ ను బ్రేక్ చేస్తుందేమో అని అంతా అనుకున్నారు కానీ…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు మొదటి వారం తర్వాత మాస్టర్ రికార్డ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది. మాస్టర్ సినిమా 50% లిమిటేషన్స్ అండ్ ఓవర్సీస్ లో 30% ఆక్యుపెన్సీలతోనే టోటల్ గా మొదటి వారంలో 181.49 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఈ ఏడాదికి ఫస్ట్ వీక్ కి గాను ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ అని చెప్పాలి.

ఈ రికార్డ్ ను రజినీ అన్నాట్టే బ్రేక్ చేస్తుంది అనుకుంటే 140 కోట్లకు పైగా గ్రాస్ తో సరిపెట్టుకోగా సూర్యవంశీ బ్రేక్ చేస్తుంది అనుకుంటే కోటి తేడాతో ఈ ఇయర్ కి గాను ఇండియన్ మూవీస్ లో ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా రికార్డ్ ను సూర్యవంశీ మిస్ అవ్వగా ఇయర్ స్టార్టింగ్ లో రికార్డ్ ను నమోదు చేసిన మాస్టర్ సినిమా 11 నెలలుగా టాప్ లోనే కొనసాగుతూ ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here