సినిమాల మీద అప్పుడప్పుడు అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ వ్యతిరేకత వస్తూ ఉంటుంది, ఇప్పుడు ఇలాంటి వ్యతిరేకతనే సొంతం చేసుకుంటుంది యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ లైగర్ సినిమా… భారీ అంచనాలతో బరిలోకి దిగిన సినిమా తొలి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఏ దశలో కూడా ఇక అంచనాలను అందుకోలేక పోయింది. అయినా కానీ ఉన్నంతలో సినిమా హిందీలో…
పర్వాలేదు అనిపించేలా ఓపెన్ అయినా కానీ సినిమాకి ఆడియన్స్ నుండి కామన్ రేటింగ్స్ మాత్రం దారుణంగానే ఉన్నాయి అని చెప్పాలి. దానికి నిదర్శనం IMDB లో సినిమా కి వచ్చిన రేటింగ్ ను చూస్తె నిజం అనిపించక మానదు అనే చెప్పాలి. సినిమా కి మొత్తం మీద…
ఈ ఇయర్ లో రిలీజ్ అయిన సినిమాల పరంగా వన్ ఆఫ్ ది లోవేస్ట్ యూసర్ రేటింగ్ సొంతం అయ్యింది అని చెప్పాలి. కేవలం 1.7 యూసర్ రేటింగ్ ను 10 రేటింగ్ పాయింట్స్ కి గాను సొంతం చేసుకున్న లైగర్ సినిమా ఈ ఇయర్ బిగ్ క్రేజీ మూవీస్ లో లోవేస్ట్ రేటింగ్ ను…
సొంతం చేసుకున్న సినిమాగా రికార్డును నమోదు చేసింది, అంటే ఆడియన్స్ ను సినిమా ఈ రేంజ్ లో నిరాశ పరిచింది అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపిస్తూ ఉండగా కలెక్షన్స్ పరంగా కూడా సినిమా అంచనాలను అందుకోలేక పోతుంది. ఏకంగా 90 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా…
ఈ కొండంత టార్గెట్ ను అందుకోవడానికి ఇప్పుడు సాధిస్తున్న కలెక్షన్స్ అసలు ఏ దశలో కూడా సరిపోవు అనే చెప్పాలి. ఇక ఇలాంటి రేటింగ్స్ తో సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ ని సొంతం చేసుకోగలుగుతుందో అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది…