యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్(Nikhil Siddhartha) లేటెస్ట్ మూవీ స్పై(SPY Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తొలిరోజు ఓపెనింగ్స్ పరంగా ఈ సినిమా అనుకున్న అంచనాలను అన్నీ కూడా మించి పోయి ఎక్స్ లెంట్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం లేపింది….
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకోవడం చూసి టోటల్ ట్రేడ్ కూడా విస్మయానికి గురి అయ్యారు. ఎందుకంటే సినిమా రిలీజ్ కి వారం ముందు వరకు అసలు రిలీజ్ అవుతుందో లేదో అన్న టెన్షన్ నెలకొన్న విషయం తెలిసిందే…
ఎలాగోలా రిలీజ్ ను కన్ఫాం చేసుకున్నా కూడా మరీ నిఖిల్ ప్రీవియస్ మూవీస్ తో పోల్చితే అనుకున్న రేంజ్ లో ప్రమోషన్స్ కూడా ఈ సినిమాకి సొంతం అవ్వలేదు. దాంతో మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ కొంచం మిక్సుడ్ గా ఉన్నప్పటికీ…
తొలిరోజు బక్రీద్ పండగ అడ్వాంటేజ్ ను ఓ రేంజ్ లో వాడుకుని వరల్డ్ వైడ్ గా నిఖిల్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకుని తన కెరీర్ లో మొట్ట మొదటి సారిగా వరల్డ్ వైడ్ గా 10 కోట్లకు పైగా గ్రాస్ ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమాగా నిలిచింది.
ఇది వరకు కార్తికేయ2(Karthikeya2) సినిమా 8.50 కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ కలెక్షన్స్ ని ఆల్ మోస్ట్ 2 కోట్ల వరకు ఎక్కువ గ్రాస్ కలెక్షన్స్ తో 10.45 కోట్ల గ్రాస్ ను అందుకుని స్పై సినిమా సంచలనం సృష్టించింది. సినిమాకి పండగ అడ్వాంటేజ్ తో సాలిడ్ వసూళ్లు వస్తాయి అనుకున్నా ఈ రేంజ్ లో వసూళ్లు చూసి అందరూ ఆశ్యర్యపోయారనే చెప్పాలి.