Home న్యూస్ “క” మూవీ ట్రైలర్ రివ్యూ….అదిరిపోయింది ట్రైలర్!!

“క” మూవీ ట్రైలర్ రివ్యూ….అదిరిపోయింది ట్రైలర్!!

0
Kiran Abbavaram Ka Movie Trailer Review
Kiran Abbavaram Ka Movie Trailer Review

బాక్స్ ఆఫీస్ దగ్గర కొంత కాలంగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరోలలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఒకరు…తన కెరీర్ లో ఇప్పుడు భారీ బడ్జెట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ అయిన క(Ka Movie Trailer Review) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఈ దీపావళి కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా…

సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు….ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యి కిరణ్ అబ్బవరంకి సాలిడ్ కంబ్యాక్ హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉన్న మూవీలా అనిపిస్తుంది క మూవీ ట్రైలర్….

కథ పాయింట్ ని కొద్ది వరకు ట్రైలర్ లో రివీల్ చేయగా….కొండల నడుమ ఉండే ఒక గ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అవుతుంది, అలాంటి చోట పోస్ట్ మాన్ గా జాయిన్ అవుతాడు హీరో…అందరికీ ఉత్తరాలు ఇస్తూ, మరో పక్క ఒక అమ్మాయిని ఇష్టపడుతూ…

ఉండగా సడెన్ గా ఒక ఉత్తరం గురించి సడెన్ ట్విస్ట్ ఇస్తూ గుర్తు తెలియని విలన్ ఎంట్రీ వస్తుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అనిపిస్తూ కట్ చేసిన ట్రైలర్ పెర్ఫెక్ట్ స్టార్ట్ టు ఫినిష్ ఎక్స్ లెంట్ గా ఆకట్టుకుంది…

కిరణ్ అబ్బవరం న్యూ లుక్ మెప్పించాగా విలేజ్ బ్యాగ్ డ్రాప్ అండ్ విజువల్స్, గ్రాండియర్ ట్రైలర్ లో మెప్పించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఇంప్రెస్ చేసింది. ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచేసింది అని చెప్పాలి. దీపావళి టైంలో రిలీజ్ కాబోతున్న…

మూవీస్ లో బెస్ట్ ట్రైలర్ కట్ గా అనిపించింది క మూవీ ట్రైలర్…..సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యి మంచి హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here