Home న్యూస్ 20 కోట్ల సినిమా… వీకెండ్ OTT కలెక్షన్స్ ఇవే–షాకింగ్!!

20 కోట్ల సినిమా… వీకెండ్ OTT కలెక్షన్స్ ఇవే–షాకింగ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయితే సినిమాల రోజు వారి ఏరియాల కలెక్షన్స్ ఎప్పటి కప్పుడు రిలీజ్ అవుతూ ఉండేవి కానీ ఇప్పుడు మరి కొన్ని వారాలు ఆగాల్సిన అవసరం ఉండగా ఈ లోపు ఈ మధ్య కొన్ని సినిమాలను డైరెక్ట్ రిలీజ్ చేయడమే కాకుండా పే పెర్ వ్యూ పద్దతి లో రిలీజ్ చేస్తూ వస్తున్నారు, కాగా ఆ సినిమా సాధించిన వ్యూస్ ని కొందరు లీక్స్ ద్వారా చెబుతుండగా…

కొందరు నిర్మాతలకు యూనిట్ కి వచ్చిన రిపోర్ట్ లెక్కలకు దగ్గరగా ఉండే లెక్కలను రిలీజ్ చేస్తూ వస్తున్నారు, రీసెంట్ గా పే పెర్ వ్యూ పద్దతిలో తమిళ్ లో విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన కా పే రణ సింగం సినిమా ను…

జీ ప్లెక్స్ యాప్ లో రిలీజ్ చేశారు, టికెట్ రేటు ని 199 గా ఫిక్స్ చేశారు, కాగా సినిమా మొదటి రోజు మొత్తం మీద 70 వేల మంది టికెట్ కొని చూశారట. తర్వాత రెండో రోజు కూడా 94 వేల టికెట్స్ సేల్ అవ్వగా మూడో రోజు 1 లక్ష 10 వేల మేర టికెట్ లు సేల్ అయినట్లు…

తమిళ్ ట్రేడ్ లో చెప్పుకుంటున్నారు. మొత్తం మీద వీకెండ్ పూర్తీ అయ్యే సరికి 2 లక్షల 74 వేల టికెట్ లు అమ్ముడు పోయాయి అని అంటున్నారు. అంటే మొత్తం మీద సినిమా కి యావరేజ్ గా టికెట్ సేల్స్ ద్వారా వచ్చిన రెవెన్యూ…5.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ వచ్చి ఉంటాయని అంటున్నారు… ఇవి పైపైన లెక్కలు కాగా…

ఒరిజినల్ లెక్కలు కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద సినిమాను 20 కోట్ల రేంజ్ బడ్జెట్ లో తెరకెక్కించారు. ఇక సినిమా మొత్తం మీద ఇప్పటి వరకు 4.3 లక్షల టికెట్ సేల్స్ జరిగినట్లు టోటల్ గ్రాస్ 8.5 కోట్ల దాకా వచ్చిందని అంటున్నారు…ఇది నిజం అయితే సినిమాకి షాకింగ్ గా సాలిడ్ ఓపెనింగ్స్ దక్కినట్లే లెక్క అని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here