బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా తెలుగు లో అంచనాలను అందుకోలేక పోయాయి. అప్పుడెప్పుడో రోబో సినిమాతో తెలుగు లో హిట్ కొట్టిన రజినీకాంత్ తర్వాత చేసిన సినిమాల్లో ఏ సినిమా కూడా తెలుగు లో…
బ్రేక్ ఈవెన్ ని అందుకోలేక పోయాయి. మధ్యలో కబాలి, రోబో 2.0 సినిమాలు భారీ ఓపెనింగ్స్ ను కలెక్షన్స్ ను అందుకున్నా క్లీన్ హిట్ గా నిలవలేదు. ఇక రజినీ లాస్ట్ మూవీ పెద్దన్న తెలుగు లో ఎపిక్ ఫ్లాఫ్ గా నిలవగా ఇలాంటి టైం లో…
ఆడియన్స్ ముందుకు వచ్చిన జైలర్(Jailer Movie) భోలా శంకర్(Bholaa Shankar) తో పోటిలో రిలీజ్ అయ్యి పోటిలో విజయాన్ని సొంతం చేసుకుని ఊహకందని కలెక్షన్స్ తో 5 రోజుల్లో 22.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకున్న సినిమా ఈ రోజు కలెక్షన్స్ తో…
కబాలి సినిమా సాధించిన 22.6 కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది….రజినీ కెరీర్ లో మూడో బిగ్గెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా జైలర్ తెలుగు రాష్ట్రాల్లో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కొస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…
లాంగ్ రన్ లో ప్రజెంట్ ట్రెండ్ ను చూస్తూ ఉంటే 35 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సూపర్ స్టార్ కెరీర్ లో ఇది ఎపిక్ కంబ్యాక్ అని చెప్పాలి ఇప్పుడు. ఈ కంబ్యాక్ ఏ రేంజ్ లో ఉంటుందో, లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.