Home న్యూస్ కల్కి: బుజ్జి-భైరవ(2 ఎపిసోడ్స్) రివ్యూ….మైండ్ బ్లోయింగ్!

కల్కి: బుజ్జి-భైరవ(2 ఎపిసోడ్స్) రివ్యూ….మైండ్ బ్లోయింగ్!

0

ఒక సినిమాను ఎలా ప్రమోట్ చేయాలో పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ మేకర్స్ ని చూసి నేర్చుకోవాల్సిందే…జూన్ 27 న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న కల్కి సినిమాను తమదైన స్టైల్ లో ప్రమోట్ చేస్తూ ఉండగా…

రీసెంట్ గా సినిమాను బుజ్జి అనే క్యారెక్టర్ ను ఇంట్రో చేస్తూ సినిమాలో ప్రభాస్ వాడిన స్పెషల్ బండిని ఎంత ప్రమోట్ చేయాలో అంత చేస్తూ ఉండగా, మరో పక్క రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో స్పెషల్ యానిమేషన్ సిరీస్ ను రిలీజ్ చేశారు. అందులో భాగంగా 2 ఎపిసోడ్ లను రిలీజ్ చేయగా బుజ్జి అండ్ భైరవ(Bujji And Bhairava Series) యానిమేసన్ సిరీస్ ను రూపొందించి రిలీజ్ చేశారు…

ఆ ఎపిసోడ్స్ లో ప్రభాస్, కీర్తి సురేష్(keerthy suresh) మరియు బ్రహ్మానందం లతో వాయిస్ ఓవర్ ఇప్పించడంతో ఆల్ మోస్ట్ సినిమా ఎలా ఉంటుంది అన్నది క్లియర్ గా చూపిస్తూ యానిమేషన్ తోనే సినిమా మీద అంచనాలు పెరిగేలా చేశారు అని చెప్పాలి… కల్కి అనే సినిమా 2898AD టైంలో నడుస్తుంది కాబట్టి అప్పుడు డబ్బుల ప్లేస్ లో…

యూనిట్స్ చాలా ముఖ్యం అవుతాయి, దాంతో హీరో ఆ యూనిట్స్ కోసం బౌంటీలు(అంటే దొంగలు) లను పట్టుకోవాలని చూస్తాడు కానీ సరైన బండి లేక పోవడంతో అది జరగదు…మరో పక్క బుజ్జి అనే AI ఆల్ రెడీ 100 సక్సెస్ ఫుల్ మిషన్స్ ను కంప్లీట్ చేయగా తన నెక్స్ట్ ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న టైంలో తన పై జరిగిన అటాక్ తో చెత్తలో పడుతుంది…

అక్కడికి వచ్చిన హీరోకి బుజ్జికి ఫ్రెండ్ షిప్ అవుతుంది…ఆ ఇద్దరు తర్వాత ఏం చేశారు అన్నది 2 షార్ట్ ఎపిసోడ్స్ లో చూపించారు. ఆల్ మోస్ట్ ఈ సీన్స్ అన్నీ షార్ట్ గా సినిమాలో ఉంటాయి. ఆ వరల్డ్ ని పరిచయం చేయడానికి ఈ యానిమేషన్ సిరీస్ ను వాడుకుంటున్న తీరు నిజంగానే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి.

ఈ యానిమేషన్ సిరీస్ చూసిన వాళ్ళకి సినిమా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా అర్ధం అవుతుంది, తద్వారా రిలీజ్ టైంలో ఎలాంటి కన్ఫ్యూజన్ లు ఉండవు….అదే సినిమాకి బిగ్ ప్లస్ పాయింట్ అవుతుంది…ఇక ఈ సిరీస్ లో ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి లాంటివి తెలియాల్సి ఉండగా సినిమా రిలీజ్ టైంకి అంచనాలు మరో లెవల్ కి వెళ్ళడానికి ఈ సిరీస్ బాగా హెల్ప్ కాబోతుంది సినిమాకి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here