Home న్యూస్ ఇక హిందీలో ఆపడం కష్టమే….కలెక్షన్స్ జాతర ఖాయం!!

ఇక హిందీలో ఆపడం కష్టమే….కలెక్షన్స్ జాతర ఖాయం!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898AD Movie) మొదటి రోజు అద్బుతమైన కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రెండో రోజు కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్స్ ని అన్ని చోట్లా సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది…తెలుగు రాష్ట్రాల్లో సినిమా మీద ఉన్న క్రేజ్ దృశ్యా ఎక్స్ లెంట్ గా ఓపెనింగ్స్ ను అందుకున్న సినిమా హిందీ మార్కెట్ లో ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుంది అన్నది…

ఆసక్తిగా మారగా మొదటి రోజున 22.50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని నార్మల్ వర్కింగ్ డే లో ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఊచకోత కోయగా రెండో రోజు ఫ్రై డే అయినా వర్కింగ్ డేనే అవ్వడంతో డ్రాప్స్ ఉంటాయి అనుకున్నా కూడా సినిమా రిమార్కబుల్ హోల్డ్ ని చూపించడం అందరినీ ఆశ్యర్యపరిచింది. అసలు ప్రమోషన్స్ లేకుండానే సినిమాను…

జనాలు భారీగా యాక్సెప్ట్ చేస్తూ ఉండటం విశేషం కాగా రెండో రోజు లెక్క 23.25 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా వేస్తున్నారు. దాంతో రెండు రోజుల హిందీ కలెక్షన్స్ రేంజ్ 45.75 కోట్ల రేంజ్ లో ఉండబోతుండగా ఇక శని ఆదివారాల్లో సినిమా మరింత జోరు చూపించే అవకాశం ఉందని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమా హిందీ ఆడియన్స్ కి బాగానే ఎక్కేసినట్లు అనిపిస్తుంది…

వీకెండ్ లో 95-100 కోట్ల రేంజ్ కి కనుక సినిమా వెళితే ఇక హిందీలో రిమార్కబుల్ లాంగ్ రన్ ని అందుకోవచ్చు, ప్రభాస్ మాస్ స్టార్ డం కి తోడు అక్కడ లెజెండ్రీ అమితాబ్ ను చాలా పవర్ ఫుల్ గా చూపించడం కూడా ఓల్డ్ ఆడియన్స్ కి కూడా బాగా ఎక్కేసింది… దాంతో అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పుడు కల్కి మూవీ ప్రభాస్ కెరీర్ లో హిందీ వర్షన్ లో బాహుబలి తర్వాత….

ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఓవరాల్ గా లాంగ్ రన్ లో కల్కి మూవీ హిందీలో 250 కోట్లు ఆ పైన టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు… మరి అంతకుమించి కనుక వస్తే ఇక మిగిలింది బిగ్ బోనస్ అని చెప్పాలి. ప్రస్తుతానికి లాంగ్ వీకెండ్ లో సినిమా ఎలాంటి హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here