బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ క్రేజ్ పవర్ ఉన్న హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఒకరు…మిగిలిన హీరోలు బాక్స్ అఫీస్ దగ్గర కొత్త సినిమాలు చేయడానికి చాలా ఆలస్యం చేస్తూ ఉండగా మరో పక్క ప్రభాస్ మాత్రం వరుస పెట్టి సినిమాలను చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతూ ఉండగా…
ఏడాది గ్యాప్ లో ప్రభాస్ నటించిన 3 సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ లాస్ట్ ఇయర్ జూన్ టైంలో ఆదిపురుష్(Adipurush) మూవీతో భారీ ట్రోల్స్ ని ఫేస్ చేసినా కూడా ఓవరాల్ గా ఓపెనింగ్స్ సాలిడ్ గా అందుకోవడంతో పర్వాలేదు అనిపించగా 7 నెలల క్రితం వచ్చిన…
సలార్(Salaar Movie) మాత్రం రాంగ్ టైం రిలీజ్ వలన ఇంపాక్ట్ పడినా కూడా ఓవరాల్ గా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా మేజర్ గా సినిమా నైజాం ఏరియాలో నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ ను సృష్టించింది…టోటల్ రన్ లో ఏకంగా సినిమా 71.40 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని…
సినిమా సంచలనం సృష్టించింది…ఇక ఈ సినిమా వచ్చిన 7 నెలల తర్వాత ఆ మాస్ మూవీతో పోల్చితే కంప్లీట్ గా డిఫెరెంట్ జానర్ అయిన సైన్స్ ఫిక్షన్ అండ్ మైతలాజిక్ టచ్ తో రాగా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా రిలీజ్ అయిన కల్కి 2898 AD(Kalki2898AD Movie) సినిమా యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకున్న సినిమా…
ఇప్పుడు అన్ని ఏరియాల్లో సాధించిన కలెక్షన్స్ ఒకెత్తు అయితే ఇప్పుడు నైజాం ఏరియాలో సాధించిన కలెక్షన్స్ మరో ఎత్తుగా చెప్పాలి ఇప్పుడు…అది ఏ రేంజ్ లో ఉంది అంటే సలార్ మూవీ నెలకొల్పిన నాన్ ఆర్ ఆర్ ఆర్ రికార్డ్ నైజాం కలెక్షన్స్ ని ఇప్పుడు కల్కి మూవీ…
9 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ చేసి 80 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది, సెకెండ్ వీక్ సినిమా స్ట్రాంగ్ గా హోల్డ్ ని చూపిస్తే టోటల్ రన్ లో 90 కోట్ల నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది, నైజాం లో బాక్ టు బాక్ 70 కోట్ల సినిమాలతో చరిత్ర సృష్టించాడు రెబల్ స్టార్…