Home న్యూస్ మమ్మోత్ కల్కి సౌత్ OTT బిజినెస్….చుక్కలు కనిపించాయి సామి!!

మమ్మోత్ కల్కి సౌత్ OTT బిజినెస్….చుక్కలు కనిపించాయి సామి!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ ఆడియన్స్ ముందుకు ఈ నెల 27న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా మీద అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి… ఇక రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే సాలిడ్ గా బిజినెస్ ను సొంతం చేసుకుంటూ ఉండగా….

ఆల్ రెడీ సినిమా హిందీ OTT బిజినెస్ ను భారీ రేటుకి అమ్ముడు పోయినట్లు టాక్ ఉండగా, మొత్తం మీద 160 కోట్ల మమ్మోత్ రేటుకి OTT రైట్స్ ను అమ్మినట్లు చెబుతూ ఉండగా సినిమా ఇప్పుడు సౌత్ డబ్బింగ్ రైట్స్ డిజిటల్ రైట్స్ బిజినెస్ కూడా కన్ఫాం ఆయ్యిందని తెలుస్తుంది… సౌత్ భాషలు అన్ని కలిపి ఓవరాల్ గా సినిమా కి…

మమ్మోత్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది… మొత్తం మీద 190 కోట్ల రేంజ్ లో డిజిటల్ రైట్స్ సౌత్ భాషలకు గాను కలిపి అమ్మినట్లు తెలుస్తూ ఉండగా టోటల్ గా సినిమా డిజిటల్ రైట్స్  సౌత్ అలాగే హిందీ భాషలు కలిపి ఏకంగా ఇప్పుడు 350 కోట్ల మమ్మోత్ రేటుకి అమ్మినట్లు తెలుస్తూ ఉండగా ఈ రేంజ్ రేటుని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు…

ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా రేంజ్ లో సాలిడ్ బిజినెస్ జరగడం ఖాయం కాగా ఇలా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఈ రేంజ్ లో జరగడంతో మేకర్స్ కి చాలా మొత్తం ఇక్కడ నుండే రికవరీ అయ్యిందని అంటున్నారు. ఇక థియేట్రికల్ బిజినెస్ కూడా భారీ రేటుకి సొంతం అవ్వడం ఖాయం కాగా ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here