ఎపిక్ కలెక్షన్స్ తో రిలీజ్ అయిన అన్ని చోట్లా సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హిస్టారికల్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) సినిమా తెలుగు రాష్ట్రాల ఆవల ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో మంచి లాభాలను సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓవరాల్ గా టార్గెట్ ను అయితే…
దాటేసి లాభాలను సొంతం చేసుకుంది కానీ సీడెడ్ అలాగే ఇతర మేజర్ ఆంద్ర ఏరియాల్లో మాత్రం కొంచం నష్టాలను సొంతం చేసుకుంది, కానీ ఇక్కడ వచ్చిన నష్టాలు నైజాంలో సాధించిన సెన్సేషనల్ లాభాలతో పూర్తిగా కవర్ అయినా కూడా ఓవరాల్ గా మిగిలిన చోట్లతో…
పోల్చి చూస్తె తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్ర సీడెడ్ లలో సినిమా కొంచం అండర్ పెర్ఫార్మ్ చేసింది అనే చెప్పాలి. నైజాం రేంజ్ లో పెర్ఫార్మ్ చేసి ఉంటే సినిమా వసూళ్లు ఇంకా భారీగా పెరిగి ఉండేవి…మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా తెలుగు రాష్ట్రాల్లో…
187 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుంది, ఓవరాల్ గా సినిమా తెలుగు రాష్ట్రాల్లో వాల్యూ బిజినెస్ 168 కోట్ల దాకా జరిగింది….దాంతో టోటల్ రన్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
Kalki 2898 AD Telugu States Total Collections(Inc GST)
👉Nizam: 92.80Cr
👉Ceeded: 21.80CR
👉UA: 21.73Cr
👉East: 12.46Cr
👉West: 9.65Cr
👉Guntur: 11.32CR
👉Krishna: 11.32Cr
👉Nellore: 6.19Cr
AP-TG Total:- 187.27CR(296.15CR~ Gross)
మొత్తం మీద బిజినెస్ మీద సినిమాకి 19 కోట్ల మేర లాభం వచ్చినా అందులో నైజాంలోనే 65 కోట్ల బిజినెస్ మీద 27.8 కోట్ల లాభం రాగా ఆంధ్రప్రదేశ్ టోటల్ వాల్యూ బిజినెస్ 103 కోట్లకు సినిమా 94.47 కోట్ల రికవరీ చేసి 8.5 కోట్ల మేర నష్టాన్ని సొంతం చేసుకుంది…
కానీ ఎలాంటి పండగ అడ్వాంటేజ్ లు లేకుండా….3 నెలల అన్ సీజన్ ఇంపాక్ట్ ను తట్టుకుని బాక్స్ అఫీస్ దగ్గర ఈ రేంజ్ లో వసూళ్ళని అందుకోవడం కూడా విశేషం అనే చెప్పాలి. ఓవరాల్ గా బిజినెస్ మీద తెలుగు స్టేట్స్ లో డీసెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా…