కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు పాత సినిమాల థియేటర్స్ ని పీకేసి కొత్త సినిమాలకు ఇవ్వడం అన్నది కామన్ గా జరుగుతూ ఉంటుంది, కానీ చాలా రేర్ గా కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా పాత సినిమాలకు మంచి టాక్ ఉండి ఆడియన్స్ లో సినిమా మీద క్రేజ్ ఉంటే కొత్త సినిమాలు వచ్చినా కూడా పాత సినిమాలకు థియేటర్స్ పెంచుతారు…
ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియాలో ఇదే జరుగుతుంది. మూడో వారంలో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD(Kalki 2898 AD Movie) ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవ్వడం అదే టైంలో బాలీవుడ్ లో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటించిన…
సర్ ఫిరా(Sarfira Movie) అలాగే పాన్ ఇండియా రిలీజ్ ను సొంతం చేసుకున్న కమల్ హాసన్(Kamal Haasan) నటించిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) లు రిలీజ్ అవ్వగా ఒక సినిమాకి మంచి టాక్ రాగా మరో సినిమా కి ఫ్లాఫ్ టాక్ రాగా రెండు సినిమాలను సైతం….
కల్కి డామినేట్ చేస్తూ ఉండగా 3rd వీకెండ్ లో ఉన్నా కూడా ఎక్స్ లెంట్ గా ట్రెండ్ అవుతూ ఉండగా మిగిలిన 2 సినిమాలను సైతం డామినేట్ చేయగా చాలా చోట్ల కల్కి థియేటర్స్ ఈ సినిమాల కోసం తగ్గించారు…అదే టైంలో ఇప్పుడు ఈ రెండు సినిమాలు అనుకున్న పెర్ఫార్మ్ చేయకపోవడంతో…
ఆ థియేటర్స్ లో చాలా వరకు ఇప్పుడు ఆదివారం రోజున కల్కి సినిమాకే కేటాయించారు…తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా స్క్రీన్స్ పెరగలేదు కానీ హిందీలో, కర్ణాటక మరియు కేరళ లాంటి ఏరియాల్లో ఈ రెండు సినిమాలు పెర్ఫార్మ్ చేయని థియేటర్స్ లో కల్కి దుమ్ము లేపింది… లోకల్ మూవీస్ ని డామినేట్ చేస్తూ ఈ ఇయర్ ఇప్పటి వరకు బిగ్గెస్ట్ పాన్ ఇండియా సక్సెస్ ను అందుకుంది కల్కి మూవీ….