Home న్యూస్ ప్రభాస్ కల్కి ట్రైలర్ రివ్యూ….1000 కోట్ల బొమ్మ ఇది!!

ప్రభాస్ కల్కి ట్రైలర్ రివ్యూ….1000 కోట్ల బొమ్మ ఇది!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ మీద హైప్ అలాగే అంచనాలు సాలిడ్ గా ఉన్నాయి. ఇప్పటి వరకు సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఆల్ రెడీ మంచి బజ్ ను క్రియేట్ చేయగా ఇప్పుడు ఆ బజ్ ను భారీ లెవల్ లో పెంచేసెందుకు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు…

ట్రైలర్ చూసిన తర్వాత సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగిపోగా ట్రైలర్ లో ఉన్న కంటెంట్ కి సినిమా మ్యాచ్ చేయగలిగితే బాక్స్ అఫీస్ దగ్గర ఈ సినిమా 1000 కోట్ల సినిమా అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి… కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు ట్రైలర్ లో రిలీజ్ చేయగా కథ పాయింట్ కి మించి…

విజువల్స్, గ్రాండియర్, టేకింగ్ ఓ రేంజ్ లో హైలెట్ గా నిలిచాయి అని చెప్పాలి…అవే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ గా నిలవబోతుండగా కథ పాయింట్ పెర్ఫెక్ట్ గా తెరమీద పండితే ఇక బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయమని చెప్పొచ్చు… ప్రభాస్ లుక్స్ కానీ డైలాగ్స్ కానీ హైలెట్ గా నిలవగా అమితాబ్ రోల్ మరో బిగ్ హైలెట్ గా నిలిచింది..

ఇక ట్రైలర్ లో కమల్ హాసన్ షాకింగ్ లుక్ కూడా మెస్మరైజ్ చేయగా మిగిలిన రోల్స్ అన్నింటినీ చిన్నగా పరిచయం చేశారు….ట్రైలర్ ఎండ్ లో ప్రభాస్ గాల్లో ఎగిరే షాట్ మరో లెవల్ లో మెప్పించగా…ఓవరాల్ గా ఈ నెల 27న మనం ఒక విజువల్ వండర్ ని చూడబోతున్నామని ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది…

ప్రభాస్ మాస్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా సినీ లవర్స్ ను ఇంప్రెస్ చేసే అవకాశం ఎంతైనా ఉన్న ఈ సినిమా ఇక 24 గంటల్లో యూట్యూబ్ లో ఏ రేంజ్ లో రికార్డుల వర్షం కురిపిస్తుందో చూడాలి. ఇక సినిమా ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కానుండగా అంచనాలను అందుకుని 1000 కోట్ల బొమ్మగా నిలుస్తుందో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here