Home న్యూస్ కల్కి రిలీజ్ ట్రైలర్ రివ్యూ….ఈ సారి లెక్క తప్పేలా లేదుగా!!

కల్కి రిలీజ్ ట్రైలర్ రివ్యూ….ఈ సారి లెక్క తప్పేలా లేదుగా!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా మొదటి ట్రైలర్ రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలను పెంచేయగా రెండో ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా ఈ ట్రైలర్ లో కథని మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్…అది చాలా వరకు ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పాలి.

రెండో ట్రైలర్ లో అసలు కథ పాయింట్ ని చాలా వరకు రివీల్ చేశారు…..ఎన్ని ప్రయత్నాలు చేసినా మనిషి మారాడు అని భావించే విలన్ ఒక అమ్మాయి కడుపులో ఉన్న శిశివు వళ్ళ తనకి ప్రమాదం అని గ్రహించి తనని చంపాలని చూస్తాడు…అదే టైంలో ఎప్పటి నుండో అజ్ఞ్యాతంలో ఉన్న అశ్వద్ధామ ఆ అమ్మాయి కడుపులో ఉన్నది దేవుడి అని భావించి తనని కాపాడతాడు…

మరో పక్క హీరో కాంప్లెక్స్ లో ఎంటర్ అవ్వడానికి దీపికను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు….ఆ తర్వాత కథ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే అనిపించేలా ట్రైలర్ 2 ని కట్ చేశారు…ఈ సారి మరింత మంది స్టార్ కాస్ట్ ను ట్రైలర్ లో చూపించగా కమల్ హాసన్ లుక్ మాత్రం షాకింగా అనిపించేలా ఉందని చెప్పాలి..

ప్రభాస్ వి ట్రైలర్ 2 లో చాలా తక్కువ షాట్స్ ను పెట్టగా ఎక్కువగా హైలెట్ అయింది మాత్రం అమితాబ్ బచ్చన్ మరియు కమల్ హాసన్ లు అని చెప్పాలి ట్రైలర్ 2 లో…ఓవరాల్ గా ట్రైలర్ 2 కూడా చూసిన తర్వాత కల్కి మూవీ పెర్ఫెక్ట్ కథతో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీలా అనిపిస్తూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం అంచనాలను అందుకున్నా కూడా…

సంచలన కలెక్షన్స్ తో రికార్డులను బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. మేకర్స్ మరింత శ్రద్ధతో ఇతర ఇండస్ట్రీలలో సైతం సినిమాను ఎంత వీలయితే అంత ప్రమోషన్స్ చేస్తే బాగుంటుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్ది సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక సినిమా ఎంతవరకు ఈ అంచనాలను అందుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here