బాక్స్ ఆఫీస్ దగ్గర మూడో వారంలో అడుగు పెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ ఈ వారం రిలీజ్ అయిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) సినిమాతో పోటి వలన థియేటర్స్ ని కోల్పోయినా కూడా పాజిటివ్ టాక్ పవర్ వలన మళ్ళీ కుమ్మేస్తూ దూసుకు పోవడం మొదలు పెట్టింది..
రెండు సినిమాలకు ఇప్పుడు వీకెండ్ అడ్వాంటేజ్ లభించడంతో తెలుగు రాష్ట్రాల్లో వేటి రేంజ్ లో అవి ఆడియన్స్ ను ఆకట్టుకుంటూ ఉండగా 17వ రోజులో అడుగు పెట్టిన కల్కి మూవీ తెలుగు రాష్ట్రాల్లో 16వ రోజుతో పోల్చితే మాత్రం ఆల్ మోస్ట్ 50-60% రేంజ్ లో గ్రోత్ ను బుకింగ్స్ లో చూపిస్తుంది…
ఇక భారతీయుడు2 మూవీ రిమార్కబుల్ స్టార్ట్ తర్వాత రెండో రోజు డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకున్నా కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపిస్తూ హోల్డ్ ని చూపిస్తున్న సినిమా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు…
2.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి షేర్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర 17వ రోజు ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది.
ఇక రెండు సినిమాలు డే ఎండ్ అయ్యే టైంకి ఇదే జోరుని కొనసాగిస్తే అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉండగా 17వ రోజులో కల్కి మాస్ రాంపెజ్ ను చూపిస్తూ ఉండటం విశేషం. ఇక డే ఎండ్ అయ్యే టైంకి 2 సినిమాలు ఎలా హోల్డ్ చేస్తాయో చూడాలి ఇక…