Home న్యూస్ 23rd డే కల్కి-1st డే డార్లింగ్-8th డే ఇండియన్2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

23rd డే కల్కి-1st డే డార్లింగ్-8th డే ఇండియన్2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వీకెండ్ వచ్చేసింది…కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి, అయినా కూడా ప్రభాస్(Prabhas) కల్కి 2898 AD(Kalki 2898 AD) మూవీ లిమిటెడ్ కలెక్షన్స్ తోనే స్టడీగా జోరు చూపిస్తూ ఉండగా లాస్ట్ వీక్ లో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2) మూవీ మరింత స్లో అయ్యింది… ఇక ఈ వీక్ లో ఆడియన్స్ ముందుకు….

డార్లింగ్ మూవీ(Darling Movie) రిలీజ్ అవ్వగా అన్ని సినిమాలు శుక్రవారం రోజున ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేశాయి అన్నది ఆసక్తిగా మారగా ముందుగా 23వ రోజులో ఉన్న కల్కి 22వ రోజుకి కొంచం సిమిలర్ గా ట్రెండ్ అవుతున్నా కొంచం డ్రాప్స్ కూడా ఉండటంతో…

Kalki 2898 AD 22 Days Total World Wide Collections!!

తెలుగు రాష్ట్రాల్లో 35-40లక్షల రేంజ్ లో షేర్ ని హిందీ 2 కోటికి పైగా నెట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా అన్ని చోట్లా కలిపి 1.8-2కోట్లకు పైగా షేర్ ని మరోసారి అందుకునే అవకాశం ఉండగా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది…

ఇక భారతీయుడు2 మూవీ తెలుగులో మరింత స్లో అయ్యి 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా తమిళ్ లో 1 కోటి రేంజ్ లో గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా 2.5 కోట్ల లోపు గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ వీక్ లో రిలీజ్ అయిన…

డార్లింగ్ మూవీ కొన్ని చోట్ల బుకింగ్స్ పర్వాలేదు అనిపించేలా ఉన్నా కూడా ఓవరాల్ గా మొదటి రోజు ఇప్పుడు 50 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, వర్షాలు ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు ఇంపాక్ట్ చూపకపొతే కలెక్షన్స్ అన్ని సినిమాలకు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక మూడు సినిమాల శుక్రవారం కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here