అందరూ ఒక పక్క ఉంటే తమిళ్ ఇండస్ట్రీ మాత్రం మరో పక్క అని చెప్పాలి. ఇతర ఇండస్ట్రీల నుండి వచ్చే సినిమాలను ఆదరించే విషయంలో చాలా వెనక బడి ఉంటారు, అంతో కొంత మలయాళ సినిమాలను పర్వాలేదు అనిపించేలా ఆదరిస్తారు కానీ మిగిలిన ఇండస్ట్రీల సినిమాలను అయితే పెద్దగా పట్టించుకోవడం చాలా అరదుగానే జరుగుతూ ఉంటుంది.
లేటెస్ట్ గా కొంత గ్యాప్ తర్వాత ఇండియాలో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న బిగ్ పాన్ ఇండియా మూవీ అయిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఏరియాల్లో ఓపెన్ అయ్యి అద్బుతమైన బుకింగ్స్ తో దూసుకు పోతూ ఉండగా…
టాలీవుడ్ ని భుజాన మోస్తున్న ఒకే ఒక్కడు ప్రభాస్!!
తమిళ్ లో మాత్రం సినిమా బుకింగ్స్ తీవ్రంగా నిరాశ పరిచేలా ఉన్నాయి. తమిళ్ టాప్ స్టార్స్ లో ఒకరైన కమల్ హాసన్(Kamal Haasan) సినిమాలో చాలా కీలకపాత్రని పోషించగా ఆ లుక్ కూడా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అయినా కూడా సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత….
ఏమాత్రం ఇంపాక్ట్ ను ఇప్పుడు తమిళ్ బుకింగ్స్ చూపించడం లేదు…ఇప్పటి వరకు ఓపెన్ చేసిన బుకింగ్స్ గ్రాస్ లెక్క కేవలం 1.85CR రేంజ్ లోనే ఉండటం అక్కడ జనాల ఆసక్తి ఎలా ఉంది అన్నదానికి అద్దం పడుతుంది. ప్రమోషన్స్ చేయలేదు అందుకే జనాలకు తెలియదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు కానీ…
350 కోట్ల సినిమా….ఇక్కడ తిడుతున్నారు సామి…పాపం!!
కమల్ హసన్ అలాగే ఇతర తమిళ్ యాక్టర్స్ ఉన్న క్రేజీ పాన్ ఇండియా మూవీ కి ఇంతకుమించిన ప్రమోషన్స్ ఏం కావాలి. ఇక సినిమా కి తమిళ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వాల్యూ 16 కోట్ల రేంజ్ లో జరిగింది. ఆ లెక్కన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమాకి అల్టిమేట్ పాజిటివ్ టాక్ వస్తే తప్పితే…
ఆ ఒక్కటీ వచ్చేస్తే…ఇక నెల రోజులు జాతర ఖాయం!
ఇప్పుడు తమిళ్ లో టికెట్స్ తెగే అవకాశం తక్కువే అనిపిస్తుంది. కానీ సినిమా మీద ఓవరాల్ బజ్ పాజిటివ్ గానే ఉండటంతో ఇప్పుడు టికెట్ సేల్స్ అక్కడ నిరాశ పరిచినా కూడా తర్వాత టాక్ బాగుంటే బిజినెస్ కి న్యాయం చేసే రేంజ్ లో కలెక్షన్స్ ని సినిమా అందుకుంటుంది అని అందరూ ఆశిస్తున్నారు. మరి ఇది నిజం అవుతుందో కాదో చూడాలి.