బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రతీ రోజూ ఎదో ఒక కొత్త రికార్డును నమోదు చేస్తూనే దూసుకు పోతుంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), మూడు వారాల తర్వాత కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తూ అల్టిమేట్ లాభాలను సొంతం చేసుకుంటూ…
దుమ్ము దుమారం లేపుతున్న పుష్ప2 మూవీ లేటెస్ట్ గా తెలుగు వర్షన్ కలెక్షన్స్ పరంగా టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డ్ ను నమోదు చేయగా ఈ క్రమంలో టాప్ 3 ప్లేస్ లో ఉన్న ప్రభాస్(Prabhas) నటించిన….
కల్కి మూవీ(Kalki 2898 AD) మూవీ టోటల్ తెలుగు వర్షన్ షేర్ ని క్రాస్ చేసింది…కల్కి మూవీ తెలుగు వర్షన్ కి గాను టోటల్ రన్ లో 302.52 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడు వారాల కలెక్షన్స్ తో పుష్ప2 మూవీ కల్కి టోటల్ షేర్ ని దాటేసింది…
22 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా ఓవరాల్ గా తెలుగు వర్షన్ కి గాను 308 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు. ఓవరాల్ గా తెలుగు వర్షన్ ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని అందుకున్న సినిమాల పరంగా టాప్ ప్లేస్ లో…
ఆర్ ఆర్ ఆర్ మూవీ టాప్ లో కొనసాగుతూ ఉండగా రెండో ప్లేస్ లో బాహుబలి2 సినిమా నిలిచింది…మూడో ప్లేస్ లో ఉన్న పుష్ప2 మూవీ రెండో ప్లేస్ లో ఉన్న బాహుబలి2 ని అందుకోవాలి అంటే మరో 13 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటే…
మొత్తం మీద టాలీవుడ్ లో తెలుగు వర్షన్ కింద ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాగా రికార్డ్ ను నమోదు చేసే అవకాశం ఉంది. ఈ వీకెండ్ తో పాటు న్యూ ఇయర్ హాలిడే అండ్ మరో వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో పుష్ప2 మూవీ ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…