బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కుమ్మేయగా సినిమా మూడో వారంలో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఓవరాల్ గా ఎన్ని థియేటర్స్ ని హోల్డ్ చేసి పరుగును కొనసాగిస్తుంది అన్నది ఆసక్తిగా మారగా…
తెలుగు రాష్ట్రాల్లో సినిమా రెండో వారంలో 1000 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా మూడో వారంలో కొత్త సినిమాల రిలీజ్ ఉండగా మొత్తం మీద మరోసారి నైజాంలో ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ 150 కి పైగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది సినిమా…ఇక ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాలు కలిపి…
400 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా ఓవరాల్ గా మూడో వీక్ లో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో 550 వరకు థియేటర్స్ లో రన్ ని కొనసాగిస్తూ ఉండగా హిందీలో సినిమా 1200 వరకు స్క్రీన్స్ లో మూడో వీక్ ని కొనసాగిస్తూ ఉంది ఇప్పుడు…
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 200 వరకు థియేటర్స్ లో పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం, ఓవరాల్ గా మూడో వారంలో సినిమా భారతీయుడు2(Bharateeyudu2 Movie) నుండి పోటిని తట్టుకుని కూడా ఇండియాలో ఆల్ మోస్ట్ 2000 వరకు థియేటర్స్ లో రన్ అవుతూ ఉండగా…
ఓవర్సీస్ థియేటర్స్ తో కలిపి ఇప్పుడు వరల్డ్ వైడ్ గా 2600 వరకు థియేటర్స్ లో రన్ అవుతుంది…రెండో వీక్ లో 4500 వరకు థియేటర్స్ లో రన్ అయిన సినిమా మూడో వీక్ లో కూడా సాలిడ్ హోల్డ్ నే చూపిస్తూ ఉండగా ఇక మినిమమ్ హోల్డ్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించినా కూడా లాభాలను ఇంకా పెంచుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.