బాక్స్ ఆఫీస్ దగ్గర 5వారాలను ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD Movie) 5వ వారంలో కూడా మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 6వ వారంలో అడుగు పెట్టిన సినిమా కొత్త సినిమాలను తట్టుకుని ఎంతవరకు థియేటర్స్ ని హోల్డ్ చేసింది అన్నది..
ఆసక్తిగా మారగా సినిమా 6వ వారంలో నైజాంలో ఇప్పుడు 60 వరకు థియేటర్స్ ని మరోసారి హోల్డ్ చేయగా ఆంధ్ర సీడెడ్ లో సినిమా 110 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయగా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో 6వ వీక్ లో సినిమా 175 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేయబోతుంది…5వ వారంతో పోల్చితే…
50వరకే థియేటర్స్ తగ్గాయి….ఇక హిందీ బెల్ట్ లో సినిమా 200 వరకు స్క్రీన్స్ లో రన్ అవుతూ ఉండగా మిగిలిన చోట్ల డౌన్ అయిన సినిమా ఓవరాల్ గా 6వ వారంలో ఇండియాలో 420 కి పైగా థియేటర్స్ లో రన్ కానుంది…. ఇక స్లో అయిపోయిన సినిమాకి ఊపిరి పోస్తూ…
మేకర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సినిమా రేట్స్ ని తగ్గించారు…అన్ని చోట్లా ఇప్పుడు ఆల్ మోస్ట్ 50,70,110 వరకు టికెట్ రేట్స్ సినిమాకి ఉండబోతున్నాయి…. 5వ వారంలో ఆల్ మోస్ట్ 100-175 వరకు సింగిల్ స్క్రీన్స్ లో 250 వరకు మల్టీప్లెక్సులలో యావరేజ్ గా రేట్స్ ఉండగా…
ఇప్పుడు ఆ రేట్స్ భారీగా తగ్గబోతున్నాయి 6వ వారంలో…దాంతో కొత్త సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోతే మరోసారి కల్కి మూవీ చూడటానికి జనాలు థియేటర్స్ కి వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. కలెక్షన్స్ మరీ భారీగా ఏమి పెరగకపోయినా కూడా థియేటర్స్ లో…ఫుట్ ఫాల్స్ పెరిగే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.