Home న్యూస్ పఠాన్ రికార్డును బద్దలు కొట్టిన కల్కి…ఇండియన్ టాప్2తో చరిత్రకెక్కిన ప్రభాస్!

పఠాన్ రికార్డును బద్దలు కొట్టిన కల్కి…ఇండియన్ టాప్2తో చరిత్రకెక్కిన ప్రభాస్!

0
KALKI 2898 AD Breaks Shah Rukh Khan's Pathaan's Total Collections in North America
KALKI 2898 AD Breaks Shah Rukh Khan’s Pathaan’s Total Collections in North America

బాక్స్ ఆఫీస్ దగ్గర 3 నెలల అన్ సీజన్ కి ఎండ్ కార్డ్ వేసి అల్టిమేట్ కలెక్షన్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ లేపుతూ ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ మూడో వీకెండ్ లో కూడా మరోసారి మాస్ జోరుని చూపించింది….

తెలుగు రాష్ట్రాల్లో హిందీలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఓవర్సీస్ మార్కెట్ లో రిలీజ్ అయిన రోజు నుండి కూడా ఊరమాస్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండగా.. నార్త్ అమెరికాలో టాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేస్తూ అల్టిమేట్ లాంగ్ రన్ ని సొంతం చేసుకుంటూ ఉండగా…

మూడో వీకెండ్ లో సాధించిన కలెక్షన్స్ తో నార్త్ అమెరికాలో ఇండియన్ మూవీస్ పరంగా ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటించిన ఎపిక్ కంబ్యాక్ బ్లాక్ బస్టర్ పఠాన్(Pathaan Movie) టోటల్ రన్ లో సాధించిన రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసింది…

పఠాన్ మూవీ టోటల్ రన్ లో నార్త్ అమెరికాలో 17.48 మిలియన్ డాలర్స్ ని అందుకుని సంచలనం సృష్టించగా…ఇప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేసిన కల్కి మూవీ 18 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా ఓవరాల్ గా ఇప్పుడు నార్త్ అమెరికాలో రిలీజ్ అయిన ఇండియన్ మూవీస్ లో…

ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి2(Baahubali2 Movie) 20.77M డాలర్స్ ను అందుకోగా ఇప్పుడు రెండో ప్లేస్ లో కల్కి మూవీ ఎంటర్ అయ్యింది. దాంతో ఇండియన్ మూవీస్ లో టాప్ 2 రికార్డులు రెండూ కూడా ప్రభాస్ పేరిట ఉండటం ఎపిక్ రికార్డ్ అని చెప్పాలి. ఇండియన్ హీరోలలో ఈ రేంజ్ లో రికార్డ్ ను నమోదు చేసి చరిత్ర సృష్టించాడు రెబల్ స్టార్ ప్రభాస్…ఇక కల్కి టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here