రిమార్కబుల్ కలెక్షన్స్ తో సూపర్ సాలిడ్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) 6వ వారాన్ని పూర్తి చేసుకునే పనిలో ఉండగా మరో పక్క రెండో వారంలో మంచి జోరుని చూపిస్తున్న ధనుష్(Dhanush) రాయన్(Raayan Movie) లాభాలను సాలిడ్ గా పెంచుకుంటూ దూసుకు పోతుంది.
మొత్తం మీద రెండు సినిమాలు మరో వర్కింగ్ డే లో ఎంటర్ అవ్వగా కల్కి మూవీ 42వ రోజు మరోసారి పర్వాలేదు అనిపించేలా హోల్డ్ చేస్తూ ఉండగా ఆల్ మోస్ట్ డే 41 కి మరోసారి సిమిలర్ గా ట్రెండ్ ను చూపెడుతూ ఉంది….తెలుగు రాష్ట్రాల్లో సినిమా మరోసారి…
8-10 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా హిందీ లో పర్వాలేదు అనిపిస్తున్నా మిగిలిన చోట్ల మాత్రం స్లో డౌన్ అయిన సినిమా వరల్డ్ వైడ్ గా 42వ రోజున ఓవరాల్ గా 26-30 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా…
75 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 13వ రోజున ఉన్న ధనుష్ రాయన్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఓకే అనిపిస్తూ 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా తమిళనాడులో సినిమా…
1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా 13వ రోజున 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను ఇప్పుడు సొంతం చేసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద మరోసారి వర్కింగ్ డే లో రెండు సినిమాలు మంచి హోల్డ్ ని చూపించాయి. ఇక రెండు సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి.