Home న్యూస్ నంబర్1 టు నంబర్2 కి వచ్చిన కల్కి…రీజన్ ఇదేనా!

నంబర్1 టు నంబర్2 కి వచ్చిన కల్కి…రీజన్ ఇదేనా!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో 1000 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని దాటేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా వన్ ఆఫ్ ది హైయెస్ట్ టికెట్ సేల్స్ ను కూడా సొంతం చేసుకుని దుమ్ము లేపింది….

ఎలాంటి హాలిడే అడ్వాంటేజ్ లు లేకుండానే మాస్ రచ్చ చేసిన కల్కి మూవీ థియేటర్స్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమా కి…

ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఒక రోజు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అయ్యింది. చాలా వరకు హిట్ అనిపించుకున్న సినిమాలు ఈజీగా వీకెండ్, వీక్ వరకు టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంటాయి. కానీ అందరినీ ఆశ్యర్య పరుస్తూ…

కల్కి మూవీ ఒక్క రోజు మాత్రమే అమెజాన్ ప్రైమ్ లో టాప్ లో ట్రెండ్ అవ్వగా రెండో రోజు ధనుష్ నటించిన రాయన్ మూవీ డిజిటల్ రిలీజ్ అయ్యి ఇప్పుడు టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉండగా కల్కి మూవీ ఇప్పుడు టాప్ 2 ప్లేస్ లో ట్రెండ్ అవుతూ ఉంది…

బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల ఎపిక్ బ్లాక్ బస్టర్ కేవలం 1 రోజు మాత్రమే టాప్ లో ట్రెండ్ అవ్వడం అందరినీ ఆశ్యర్య పరుస్తూ ఉండగా, రెండూ కూడా సౌత్ భాషల వర్షన్ లు ఉండగా కల్కి హిందీ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లో ఉండటం, రాయన్ హిందీ వర్షన్ కూడా అమెజాన్ ప్రైమ్ లో ఉండటం..

కలిసి వచ్చి ఎక్కువ వ్యూస్ తో టాప్ ప్లేస్ లో వెళ్ళింది అని చెప్పొచ్చు. అయినా కూడా రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ రిజల్ట్ వైడ్ చూసుకుంటే కల్కి ఇంకా ఎక్కువ జోరు చూపించాల్సింది కానీ హిందీ ఆడియన్స్ హెల్ప్ తో రాయన్ వెంటనే కల్కి ప్లేస్ లోకి వచ్చేసి టాప్ లో ట్రెండ్ అవుతుంది. ఇక డిజిటల్ లో లాంగ్ రన్ లో కల్కి ఎలా జోరు చూపిస్తుందో చూడాలి.

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here