Home న్యూస్ 2 డిసాస్టర్స్ తర్వాత కొత్త సినిమా….మళ్ళీ ఫ్లాఫ్ డైరెక్టర్ తోనే!!

2 డిసాస్టర్స్ తర్వాత కొత్త సినిమా….మళ్ళీ ఫ్లాఫ్ డైరెక్టర్ తోనే!!

956
0

టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ సక్సెస్ ల పరంగా తన తోటి హీరోలతో పోల్చితే వెనుకబడే ఉన్న హీరో కళ్యాణ్ రామ్. కెరీర్ స్టార్టింగ్ లో అతనొక్కడే లాంటి సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ పడ్డా కానీ ఆ విజయాన్ని సరిగ్గా ఉపయోగించుకోని కళ్యాణ్ రామ్ తన ఓన బ్యానర్స్ లో ప్రయోగాలు చేసి మెప్పించినా కమర్షియల్ సక్సెస్ లు అందుకోలేదు. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన కమర్షియల్ బ్లాక్ బస్టర్…

2015 లో పటాస్ రూపం లో దక్కినా కానీ మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ తనని వెక్కిరించాయి. ఎట్టకేలకు లాస్ట్ ఇయర్ 118 మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ కంబ్యాక్ చేసి 4 ఏళ్ళకి మళ్ళీ హిట్ కొట్టాడు కానీ మళ్ళీ వెంటనే నా నువ్వే మరియు ఎంత మంచి వాడవురా….

లాంటి సినిమా లతో బాక్ టు బాక్ డిసాస్టర్లు ఎదురుకున్న కళ్యాణ్ రామ్ ఇప్పుడు మరోసారి ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు. రీసెంట్ టైం లో ఎక్కడికి పోతావు చిన్న వాడా తప్ప చేసిన అన్ని సినిమాలతో ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అయిన వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో….

కొత్త సినిమా చేయబోతున్నాడు కళ్యాణ్ రామ్. రీసెంట్ గా వి ఐ ఆనంద్ డైరెక్షన్ లో వచ్చిన డిస్కో రాజా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయినా అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యింది. ఇలాంటి టైం లో ఈ సారి సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు ఈ డైరెక్టర్. ఇక కళ్యాణ్ రామ్ కూడా…

కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం మళ్ళీ రావడం తో మరోసారి పటాస్ రేంజ్ హిట్ కొట్టాలని ఆశిస్తున్నాడు కళ్యాణ్ రామ్, మరి వీరి కాంబినేషన్ లో తెరకెక్క బోతున్న అప్ కమింగ్ మూవీ తో ఈ ఇద్దరూ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ ని సొంతం చేసుకోవాలని కోరుకుందామ్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here