నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ 5-6 ఏళ్లలో పటాస్ మరియు 118 మూవీస్ మాత్రమె అంచనాలను అందుకుని మంచి విజయాలుగా నిలిచాయి. 118 మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ చేసిన ఎంత మంచి వాడవురా డిసాస్టర్ అవ్వగా తర్వాత మళ్ళీ కొత్త సినిమా కళ్యాణ్ రామ్ నుండి ఇంకా రావాల్సి ఉండగా అప్ కమింగ్ మూవీస్ లో కొన్ని టాప్ బ్యానర్స్ లో… కొన్ని తన నిర్మాణంలో చేస్తున్న కళ్యాణ్ రామ్…
తనకి సెట్ అయ్యే కథలనే ఎంచుకుంటూ వస్తున్నాడు. కాగా రీసెంట్ గా కళ్యాణ్ రామ్ కి ఒక రీమేక్ కథ నచ్చి తెలుగు లో నటించాలని భావించారని టాక్ ఉంది, కానీ అనుకోకుండా ఆ సినిమా ఆల్ రెడీ ఇప్పుడు తెలుగు లో డబ్ అయ్యి డిజిటల్ రిలీజ్ అవ్వడం కూడా జరిగింది.
దాంతో ఇప్పుడు ఆ సినిమా రీమేక్ ను మొదలు పెట్టాలా వద్ద అన్న డైలమాలో ఉన్నారు కళ్యాణ్ రామ్. ఇంతకీ ఆ సినిమా ఏంటి అంటే… మళయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన సైకో థ్రిల్లర్ మూవీ అంజమ పాతిక…. అల్టిమేట్ క్రైం అండ్ సైకో థ్రిల్లర్ నేపధ్యంలో…
ఉండే ఈ సినిమా తెలుగు రీమేక్ ని కళ్యాణ్ రామ్ ఆల్ మోస్ట్ కన్ఫాం చేయగా… ఈ లోపు సినిమా ఒరిజినల్ వర్షన్ కి ఫ్యాన్సీ రేటు చెల్లించి తెలుగు డబ్బింగ్ రైట్స్ ని తీసుకుని మిడ్ నైట్ మర్డర్స్ అంటూ ఆహా యాప్ లో రిలీజ్ చేశారు. పబ్లిసిటీ పెద్దగా చేయలేదు కాబట్టి తెలుగు లో పెద్దగా వ్యూస్ అయితే రాలేదు అనే చెప్పాలి.
దాంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ రీమేక్ చేయాలా వద్దా అన్న డౌట్ లోనే ఉండగా కొన్ని మార్పులతో రీమేక్ చేస్తే పక్కా హిట్ గ్యారెంటీ అని భావిస్తున్నారని తెలుస్తుంది. త్వరలోనే సినిమా రీమేక్ పై స్పష్టమైన న్యూస్ వచ్చే అవకాశం ఉంది. ఆల్ రెడీ తెలుగు లో వచ్చిన చూసిన వాళ్ళు తక్కువ కాబట్టి ఒకవేళ రీమేక్ సెట్ అయితే హిట్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి.