Home న్యూస్ “క” మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

“క” మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0
Kiran Abbavaram Ka Movie Review and Rating
Kiran Abbavaram Ka Movie Review and Rating

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైంలో ఎట్టి పరిస్థితులలో కూడా కంబ్యాక్ ఇస్తానని నమ్మకంతో ఈ సారి అంచనాలను అందుకుంటానని చెప్పిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ క(Ka Movie Review) తో దీపావళి రేసులో ఎంటర్ అవ్వగా, ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న కిరణ్ అబ్బవరం నమ్మకాన్ని సినిమా ఎంత వరకు నిలబెట్టిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా కథ పాయింట్ కి వస్తే…అనాధ అయిన హీరో పక్క వాళ్ళ ఉత్తారాలను చదువుతూ, ఆ ఉత్తరాల్లో ఉన్న వాళ్ళనే తన వాళ్ళు అనుకుంటాడు….ఈ క్రమంలో క్రిష్ణగిరి అనే ఊర్లో పోస్ట్ మెన్ గా ఉద్యోగం చేయడానికి రాగా….ఆ ఊర్లో మధ్యాహ్నం 3 గంటలకే చీకటి అవ్వడం, ఊర్లో అమ్మాయిలు మిస్ అవ్వడం లాంటివి జరుగుతుంది….

వీటికి హీరోకి ఉన్న లింక్ ఏంటి….ఆ తర్వాత కథ ఏమయింది అన్న ఆసక్తి కరమైన విశేషాలు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. కొన్ని సినిమాలు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒక ఫ్లో లో అలరిస్తాయి…కొన్ని సినిమాలు పడుతూ లేస్తూ కొన్ని హై మూమెంట్స్ తో ఆకట్టుకుని పర్వాలేదు అనిపిస్తాయి… ఇక కొన్ని సినిమాలు…

మొదట్లో అంతగా ఏమి లేక పోయినా కూడా కథ చివరికి వచ్చేసరికి మాత్రం అబ్బ ఏం సినిమా రా అనిపిస్తుంది… ఇలాంటి కోవకే చెందిన సినిమా క….కథ మొదలు అవ్వడంతో జస్ట్ ఓకే అనిపించేలా మొదలు అయ్యి హీరో ఇంట్రో, తన క్యారెక్టర్…ఊర్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఓకే ఓకే అనిపించేలా సాగే సీన్స్ తో…

ఫస్టాఫ్ జస్ట్ ఓకే గా సాగుతున్న టైంలో సెకెండ్ ఆఫ్ పై ఆసక్తిని పెంచేలా ఇంటర్వెల్ ఎపిసోడ్ రాగా తర్వాత సెకెండ్ ఆఫ్ కథ కూడా కొంచం సీరియస్ గానే సాగినా కూడా పెద్దగా హై ఇచ్చే మూమెంట్స్ ఏమి పడలేదు…కానీ ప్రీ క్లైమాక్స్ నుండి సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెరగం స్టార్ట్ అవుతుంది…

ఇక క్లైమాక్స్ ట్విస్ట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ అప్పటి వరకు కథ స్లో గా సాగడం, బోర్ ఫీల్ అయ్యేలా చేసిన సీన్స్ ను మరిపిస్తూ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే ఆడియన్స్ బయటికి వచ్చేలా చేస్తుంది….కిరణ్ అబ్బవరం తన రోల్ కి ఫుల్ న్యాయం చేశాడు…తన పెర్ఫార్మెన్స్ కూడా బాగా ఇంప్రూవ్ చేసుకున్నాడు…

ఇక హీరోయిన్ నయన సారికా తన రోల్ వరకు బాగా నటించి మెప్పించగా మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా తమ రోల్స్ లో బాగానే చేశారు. సంగీతం పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా మెప్పించింది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ ఆఫ్ అండ్ సెకెండ్ ఆఫ్ లో కొంత భాగం మరింత షార్ప్ గా ఉండి ఉంటే బాగుండేది….

డైరెక్టర్స్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాని చుట్టూ అల్లుకున్న కథ చెప్పడంలో మాత్రం కొంచం డ్రాగ్ చేశారు అనిపించింది…ఫస్టాఫ్ లో చాలా పార్ట్ సో సోగానే సాగుతుంది…అలా కాకుండా మరింత టైట్ స్క్రీన్ ప్లే తో ప్రజెంట్ చేసి మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ను మిక్స్ చేసి ఉంటే…

సినిమా మరో రేంజ్ లో ఉండేది…కానీ మెయిన్ క్లైమాక్స్ ను నమ్ముకుని మిగిలిన కథని పర్వాలేదు అనిపించేలా డీల్ చేసి పాస్ మార్కులు దక్కించుకున్నారు….మొత్తం మీద మరీ అంచనాలను మించిపోలేదు కానీ పర్వాలేదు అనిపించేలా సాగే సినిమా క్లైమాక్స్ బాగా రావడంతో ఈజీగా ఒకసారి చూసేలా సినిమా ఉందనిపించింది… ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here