బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీక్ లో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతున్న కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన కంగువ(Kanguva Movie) మూవీ హిస్టారికల్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా కోలివుడ్ తరుపున వన్ ఆఫ్ ది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అన్నీ అనుకున్నట్లు జరిగితే కోలివుడ్ తరుపున…
బిగ్గెస్ట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉన్న మూవీగా భావిస్తూ ఉండగా, సినిమాకి సొంత ఇండస్ట్రీ అయిన కోలివుడ్ ఇండస్ట్రీ నుండే ఇప్పుడు ఎదురుదెబ్బ తగలబోతుంది….ఇంత పెద్ద సినిమాను ఎంత సపోర్ట్ చేయగలిగితే అంత సపోర్ట్ చేయాల్సిన చోట సొంత ఇండస్ట్రీలోనే…
సినిమాకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది….ముందు అక్టోబర్ 10న రిలీజ్ అనుకుంటే రెగ్యులర్ కమర్షియల్ మూవీ అయిన వేట్టయన్ కోసం కంగువ లాంటి భారీ మూవీని పోస్ట్ పోన్ చేసుకోగా ఇప్పుడు నవంబర్ లాంటి అన్ సీజన్ లో సినిమాను సోలో గా రిలీజ్ చేసుకోవచ్చు అనుకుంటే….
దీపావళికి వచ్చి హ్యూజ్ హిట్ అయిన అమరన్(Amaran) మూవీ రెండో వారంలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంటూ ఉండటంతో మూడో వారంలో కూడా ఈ సినిమాకే ఎక్కువ థియేటర్స్ ఇవ్వబోతున్నారు అని తెలుస్తుంది…
దాంతో కంగువ సినిమాను అనుకున్న రేంజ్ లో థియేటర్స్ దక్కడం లేదని, మేజర్ పెద్ద స్క్రీన్స్ అన్నీ అమరన్ నే ప్రదర్శించడానికి థియేటర్ ఓనర్స్ ఆసక్తిని చూపెడుతూ ఉండటంతో కంగువకి ముందు 800 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ సొంతం అవుతుంది అనుకుంటే….
ఇప్పుడు అందులో సగానికి అటూ ఇటూగానే థియేటర్స్ దక్కే అవకాశం కనిపిస్తూ ఉండగా, ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై క్లియర్ గా ఉండే అవకాశం కనిపిస్తుంది…దాంతో సినిమా ఓపెనింగ్స్ ఇలానే ఉంటే అక్కడ అనుకున్న రేంజ్ లో ఉండే అవకాశం తక్కువే అని చెప్పాలి. మరి మేకర్స్ ఈ పరిస్థితిని ఎంతవరకు సాల్వ్ చేస్తారో చూడాలి ఇప్పుడు.