కోలివుడ్ లో ప్రస్తుతం మోస్ట్ హైప్ తో రిలీజ్ కి సిద్ధం కాబోతున్న అప్ కమింగ్ బిగ్ మూవీస్ లో ఒకప్పుడు వరుస హిట్స్ తో ఒక ఊపు ఊపేసి ఇప్పుడు సరైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సూర్య(Suriya) నటిస్తున్న లేటెస్ట్ మూవీ అయిన కంగువ(Kanguva Movie) మీద అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. సినిమా ఎంతవరకు ఆ అంచనాలను…
అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా ఆడియన్స్ ముందుకు ఈ సినిమా నవంబర్ 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా, కచ్చితంగా సూర్య కెరీర్ కి ఒకప్పటి లెవల్ లో తిరిగి ఫేమ్ ను తీసుకు వచ్చే అవకాశం ఉందని అందరూ నమ్ముతున్నారు.
సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదే రేంజ్ లో అంచనాలను పెంచేయగా…బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వరల్డ్ వైడ్ గా సూర్య కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకోవడం ఖాయంగా కనిపిస్తూ ఉండగా ఇప్పుడు…
ఏకంగా కోలివుడ్ తరుపున ఆల్ టైం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం కూడా ఉందని అంచనా వేస్తున్నారు…ట్రేడ్ అంచనాల ప్రకారం సినిమా మొదటి రోజు అన్నీ అనుకున్నట్లు జరిగితే 100 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుని…
మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు….తమిళనాడులో ఎక్స్ లెంట్ బజ్ ఉండటం, తెలుగు రాష్ట్రాలలో సైతం సినిమా మీద క్రేజ్ భారీగా ఉండటం, కర్ణాటక, కేరళలో ఎలాగూ కుమ్మేసే అవకాశం ఉండగా ఒక్క హిందీలో మినిమమ్ ఓపెనింగ్స్ వచ్చినా…
ఓవర్సీస్ లో సాలిడ్ ఓపెనింగ్స్ తో మొదటి రోజు సినిమా 100 కోట్ల మార్క్ ని టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఇది జరిగితే కోలివుడ్ తరుపున మూడో 100 కోట్ల ఓపెనర్ గా కంగువ సినిమా నిలిచే అవకాశం ఉంటుంది. మరి సినిమా ఆ రేంజ్ లో రచ్చ చేస్తుందో లేదో చూడాలి.