Home న్యూస్ కంగువ 1st టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!!

కంగువ 1st టాక్ వచ్చేసింది…సెన్సార్ రిపోర్ట్ ఏంటంటే!!

0
Suriya Kanguva Movie Censor 1st Review and talk
Suriya Kanguva Movie Censor 1st Review and talk

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారంలో గ్రాండ్ గా రిలీజ్ సిద్ధం అవుతున్న సినిమాల్లో పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన సూర్య(Suriya) నటించిన కంగువ(Kanguva Movie) మూవీ మీద క్రేజ్ అందరిలోనూ సాలిడ్ గా ఉంది….ఇక ట్రైలర్స్ రిలీజ్ తర్వాత సినిమా అంచనాలు మరింతగా పెరిగి పోగా…. రీసెంట్ గా సినిమా…

సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా U/A సర్టిఫికేట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా 2 గంటల 33 నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక సినిమా కి సెన్సార్ వాళ్ళ నుండి ఫస్ట్ టాక్ కూడా బయటికి వచ్చేసింది… ఓవరాల్ గా సెన్సార్ టాక్…

ఎక్స్ లెంట్ గా ఉందని చెప్పాలి ఇప్పుడు….స్టోరీ పాయింట్ పరంగా ఓకే అనిపించే కథతో వస్తున్నా ఎంచుకున్న బ్యాగ్ డ్రాప్, భారీ కాన్వాయ్ అలాగే ఎక్స్ లెంట్ విజువల్స్ తో ఆడియన్స్ ని ఒక డిఫెరెంట్ యూనివర్స్ లో ఉన్న ఫీలింగ్ కలిగించేలా సినిమా ఉంటుంది అంటున్నారు…

కథ పాయింట్ ని ఏం లీక్ చేయడం లేదు కానీ కొన్ని వందల ఏళ్ల క్రితం రెండు జాతుల మధ్య గొడవలు, తమ ప్రజలను శత్రువుల నుండి కాపాడుకోవడానికి హీరో పడిన కష్టంతో అబ్బుర పరిచే యాక్షన్ సీన్స్ తో నిండిపోయిన కంగువలో చాలానే హైలెట్స్ ఉన్నాయని అంటున్నారు..

సముద్రంలో పడవల్లో జరిగే ఫైట్ సీన్ అలాగే, కొండ దగ్గర జరిగే ఫైట్ సీన్స్ చాలా బాగా వచ్చాయని అంటున్నారు, సెకెండ్ ఆఫ్ లో కొన్ని మేజర్ ట్విస్ట్ లతో పాటు వచ్చే స్పెషల్ క్యామియో ఆడియన్స్ ను ఓ రేంజ్ లో థ్రిల్ అయ్యేలా చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు…

కానీ స్టోరీ చాలా వరకు ప్రిడిక్ట్ చేసేలా ఉంటుంది అని అంటూ ఉండగా, దాంతో పాటు తమిళ్ ఫ్లేవర్ కొంచం ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు. ఇతర భాషల ఆడియన్స్ వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న దాని పై సినిమా ఏ రేంజ్ కి వెళుతుందో అన్నది చెప్పగలం అని చెబుతున్నారు…

మొత్తం మీద సెన్సార్ తర్వాత సినిమా కి మంచి టాక్ అయితే సొంతం అయ్యింది. ఇక ఇదే రేంజ్ లో టాక్ ను ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత కూడా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు నుండే రికార్డుల జాతర ను సినిమా సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here