Home టోటల్ కలెక్షన్స్ రంగస్థలం కన్నడ వర్షన్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఈ షాక్!!

రంగస్థలం కన్నడ వర్షన్ టోటల్ కలెక్షన్స్…ఏంటి సామి ఈ షాక్!!

1340
0

     మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం ఎలాంటి రికార్డులను నమోదు చేసిందో అందరికీ తెలిసిందే, తెలుగు నాట గత ఏడాది నాన్ బాహుబలి రికార్డుల వర్షం కురిపించిన ఈ సినిమా ఆల్ టైం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం కూడా ఆ రికార్డ్ కొనసాగుతుంది, అలాంటి సినిమా ఇతర భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు దానికి తగ్గట్లు సినిమాను బాగా ప్రమోట్ చేయాలి.

కానీ రంగస్థలం రిలీజ్ అయిన ఏడాదిన్నర తర్వాత సినిమాను మలయాళం లో అలాగే కర్ణాటక లో డబ్ చేసి రిలీజ్ చేశారు. ముందుగా మలయాళం లో డబ్ చేసి రిలీజ్ చేయగా అక్కడ సినిమా డిసాస్టర్ రిజల్ట్ వచ్చింది, కేవలం 15 లక్షల రేంజ్ లో షేర్ ని సినిమా సాధించింది.

ఇక కన్నడ లో అయినా బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తారు అనుకుంటే ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సుమారు 100 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ గా 1.1 కోట్ల గ్రాస్ ని 60 లక్షల దాకా షేర్ ని అక్కడ సాధించింది, కానీ సినిమాను అక్కడ 1.8 కోట్లకు అమ్మారు.

దాంతో అక్కడ సినిమాకి ఆల్ మోస్ట్ 1.2 కోట్ల లాస్ వచ్చింది, దాంతో తెలుగు ఇండస్ట్రీ హిట్ కి ఇతర భాషల్లో ఎదురుదెబ్బ గట్టిగా తగిలింది అని చెప్పాలి. నిర్మాతలు డబ్ చేయాలి అని భావించినప్పుడు సినిమా రిలీజ్ అయిన 1 లేదా 2 నెలల్లోనే డబ్ వర్షన్ కొంచం ప్రమోషన్స్ చేసి…

రిలీజ్ చేసి ఉన్నా రెస్పాన్స్ అద్బుతంగా ఉండేదని చెప్పొచ్చు. కానీ రిలీజ్ తర్వాత ఏడాది అయిపోయిన తర్వాత మినిమమ్ ప్రమోషన్ కూడా లేకుండా సైలెంట్ గా రిలీజ్ చేయడం వలన సినిమా రిజల్ట్ భారీగా ఎదురుదెబ్బ కొట్టి అద్బుత మైన విజయం అందుకున్న సినిమా కి చిన్న మచ్చగా మిగిలిపోయింది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here