Home న్యూస్ ఓరినీ…బాయ్ కాట్ RRR అంటూ కర్ణాటకలో ట్రెండింగ్….రీజన్ ఏంటంటే!!

ఓరినీ…బాయ్ కాట్ RRR అంటూ కర్ణాటకలో ట్రెండింగ్….రీజన్ ఏంటంటే!!

0

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆడియన్స్ ముందుకు ఈ నెల 25 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు విపరీతంగా ఉండగా సినిమా అన్ని చోట్లా భారీ లెవల్ లో రిలీజ్ కానుంది…

కాగా రిలీజ్ కి ముందు ఇప్పుడు సినిమా ను బాయ్ కాట్ చేయాలి అంటూ కర్ణాటక లో కొందరు సోషల్ మీడియాలో ట్వీట్స్ వేస్తూ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు…. కారణం ఏంటి అంటే… సినిమా ను కన్నడ లో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ చెప్పారు…

హీరోలు కూడా కన్నడ లో కూడా డబ్బింగ్ చెప్పడంతో సినిమాను అక్కడ కన్నడ లో కూడా బాగానే రిలీజ్ చేస్తున్నాం అంటూ కన్నడ డిస్ట్రిబ్యూటర్ ఆల్ రెడీ కన్ఫాం చేశారు, కానీ కర్ణాటకలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసిన అన్ని చోట్లలో ఎక్కువ శాతం తెలుగు వర్షన్ నే షోలు ఉండటంతో…

కన్నడ వర్షన్ వి షోలు తక్కువగా ఉండటం తో కన్నడ ప్రజలను మోసం చేస్తున్నారు అంటూ ట్విట్టర్ లో సినిమాను కర్ణాటకలో బ్యాన్ చేయాలి అంటూ ట్రెండ్ చేయడం స్టార్ట్ చేశారు కొందరు, కానీ కన్నడ డిస్ట్రిబ్యూటర్ క్లియర్ గా కన్నడ షోలు ముందు స్లో గా ఓపెన్ చేసి రెస్పాన్స్ ను బట్టి షోలను పెంచుకుంటూ పోతామని క్లియర్ గా చెప్పారు… కన్నడ వర్షన్ ఓపెన్ చేసిన బుకింగ్స్ చాలా వరకు స్లోగా బుకింగ్స్ జరుగుతూ ఉండటం తెలుగు వర్షన్ వి ఎక్కువ బుకింగ్స్ జరుగుతూ ఉండటంతో…

కన్నడ డబ్ వర్షన్ ప్రజెంట్ బుకింగ్స్ ఫుల్స్ పడకుండా అన్ని చోట్లా కన్నడ వర్షన్ నే ఓపెన్ చేస్తే అందరూ చూడకుంటే ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి షోలు ఎక్కడైతే కన్నడ లో జనాలు చూడాలి అనుకుంటారో అక్కడ బుకింగ్స్ ఓపెన్ చేస్తున్నారని తెలుస్తుంది… రీసెంట్ టైం లో చాలా సినిమాల విషయంలో డబ్ వర్షన్ కన్నా ఒరిజినల్ కే ఎక్కువ రెస్పాన్స్ ఉంటూ వస్తుండటంతో పేరుకు డబ్ వర్షన్ పెడుతున్నా కానీ ఎక్కువ శాతం జనాలు మొదటి నుండి ఒరిజినల్ వర్షన్ నే చూడటానికి ఇష్టపడుతున్నారు కాబట్టి ఎక్కువ షోలు వాటికే ప్రేయారిటీగా ఇస్తున్నారు అక్కడ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here