Home న్యూస్ కన్నప్ప టార్గెట్ డబుల్ డిజిట్…కొడితే మాస్ రచ్చే!!

కన్నప్ప టార్గెట్ డబుల్ డిజిట్…కొడితే మాస్ రచ్చే!!

0

బాక్స్ ఆఫీస్  దగ్గర ఎప్పటి నుండో మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ను ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా సినిమాలో ఇతర ఇండస్ట్రీల నుండి స్టార్స్ నటించినా కూడా ఓవరాల్ గా సినిమా మేజర్ క్రేజ్ కి…

మాత్రం కారణం పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) స్పెషల్ క్యామియో చేయడమే అని చెప్పాలి..రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా పెద్దగా ట్రోల్స్ లాంటివి ఏమి లేకుండా సినిమా మీద ఆడియన్స్ లో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ అయితే..

క్రియేట్ చేయడంలో టీం అంతా సఫలం అయ్యారు అనే చెప్పాలి. టీసర్ రిలీజ్ టైంలో కొంచం ట్రోల్స్ పడినా ట్రైలర్ రిలీజ్ తర్వాత ట్రేడ్ పరంగా కూడా సినిమా మీద ఇప్పుడు డీసెంట్ అంచనాలు అయితే పెరిగాయి అనే చెప్పాలి. దాంతో ప్రజెంట్ సినిమా మీద మెల్లిగా పెరిగిన అంచనాలు..

సినిమాలో మెయిన్ గా ఉన్న స్టార్ కాస్ట్…అన్నింటికీ మించి ప్రభాస్ ఎక్స్ టెండెడ్ క్యామియో సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ కాబోతూ ఉండటంతో ఇవన్నీ కలిసి వచ్చి మొదటి రోజు సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా…

ఇంత స్టార్ కాస్ట్ అండ్ ప్రభాస్ కూడా ఉండటం, ట్రైలర్ తర్వాత కొంచం అంచనాలు అయితే పెరగడంతో మొదటి రోజున వరల్డ్ వైడ్ గా డబుల్ డిజిట్ షేర్ ఓపెనింగ్స్ ను అందరూ ఎక్స్ పెర్ట్ చేస్తున్నారు ఇప్పుడు. మరి ఇది జరిగితే మంచు విష్ణు కెరీర్ బెస్ట్ రికార్డుల…

రచ్చ చేసే అవకాశం ఉండగా ఒకవేళ సినిమా అంచనాలను మించిపోయి ఈ డబుల్ డిజిట్ షేర్ ఓపెనింగ్స్ ను తెలుగు రాష్ట్రాల నుండే అందుకుంటే మాత్రం అది నెక్స్ట్ లెవల్ మాస్ అనే చెప్పాలి. మరి సినిమా మొదటి రోజు ఈ టార్గెట్ ను అందుకునే ప్రయత్నంలో ఎంతవరకు సఫలం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here