Home న్యూస్ కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్…దెబ్బ మీద దెబ్బ ఇది!!

కన్నప్ప హార్డ్ డ్రైవ్ మిస్సింగ్…దెబ్బ మీద దెబ్బ ఇది!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ ఎప్పటి కప్పుడు పోస్ట్ పోన్ అవుతూ బజ్ పరంగా అనుకున్న రేంజ్ లో బజ్ లేక పోయినా కూడా కేవలం రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) స్పెషల్ రోల్ చేస్తూ ఉండటం మాత్రమే మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) సినిమా మీద ఎంతో కొంత అంచనాలను ఉండేలా చేసింది..

కానీ సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ ఇప్పుడు జూన్ 27న రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో టీం బిజీగా ఉండగా సడెన్ గా టీం కి మరో సాలిడ్ ఎదురుదెబ్బ పడినట్లు అయింది అని చెప్పాలి ఇప్పుడు…

సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం పంపిన హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ అయిపోయిందట…కన్నప్ప సినిమాకు సంబంధించిన కీలక డేటాతో కూడిన హార్డ్‌డ్రైవ్ ముంబై వీఎఫ్ఎక్స్ సంస్థ పంపిన డ్రైవ్‌ను ఆఫీసు బాయ్ చరిత అనే యువతికి అప్పగించగా, ఆమె పరారయ్యింది.

ఫిలింనగర్ పోలీసులకు కన్నప్ప టీం రీసెంట్ గా ఫిర్యాదు చేశారని సమాచారం… సినిమా కంటెంట్ ఎక్కడ ఆన్ లైన్ లో లీక్ అవుతుందో ఏమో అని టీం బయపడుతూ ఉండగా కీలక సన్నివేశాల ఫుటేజ్ లీక్ అవ్వడం వలన దాని ఇంపాక్ట్ సినిమా మీద కూడా పడే అవకాశం ఉంది..

ఓవరాల్ గా ఆల్ రెడీ బజ్ పరంగా స్లో అయిన సినిమా ఒక్క ప్రభాస్ పేరు మీద ఎంతో కొంత బజ్ ఉండగా ఇలాంటి లీక్ లు అలాగే ఇప్పుడు ఈ హార్డ్ డ్రైవ్ మిస్సింగ్ ఇంపాక్ట్ కూడా పడింది. మరి వీటన్నింటినీ తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here