మంచు విష్ణు(Manchu Vishnu) నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప(Kannappa) మూవీ ఎప్పటి నుండో వార్తల్లో నిలిచింది. హీరోగా నిర్మాతగా తన కెరీర్ లో ఇప్పటి వరకు ఏ సినిమాకి పెట్టని రేంజ్ భారీ బడ్జెట్ తో రూపొందిన కన్నప్ప సినిమా చాలా మంది స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వడంతో హైప్ ను సొంతం చేసుకోగా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే…దేవుడు అంటే అస్సలు నమ్మకం లేని హీరో తన గూడెం జనాలకు అన్యాయం జరుగుతుంది అని తెలిసి పోరాటానికి సిద్ధం అవుతాడు…ఈ క్రమంలో అసలు దేవుడంటే నమ్మకం లేని తిన్నడు ఎలా దైవ భక్తీని సంపాదించి కన్నప్ప గా మారాడు అన్నది అసలు సిసలు కథ…
సినిమా ఓపెన్ అవ్వడం శివుడిగా అక్షయ్ కుమార్-కాజల్ ల స్పెషల్ రోల్స్ తో ఓపెన్ అయ్యి తర్వాత వారియర్ అయిన హీరో ఇంట్రోతో కథ మొదలు అయ్యి తన లవ్ స్టోరీ తన గూడెం జనాలు, అక్కడి పరిస్థితులతో కథ సాగుతుంది, కానీ ఈ కథ చాలా నెమ్మదిగా పెద్దగా ఆసక్తిని కలిగించకలేక పోతూ ఉన్న టైంలో…
మోహన్ బాబు-మోహన్ లాల్ ల పాత్రలు సినిమాకి మంచి బూస్టప్ ఇచ్చి సెకెండ్ ఆఫ్ కి లీడ్ ఇస్తాయి, ఆసక్తి కరమైన ఇంటర్వెల్ బ్యాంగ్ తో సెకెండ్ ఆఫ్ స్టార్ట్ అవ్వగా కథ మళ్ళీ కొంచం పడుతూ లేస్తూ సాగినా కూడా ఒక్క సారి ప్రభాస్(prabhas) రోల్ వచ్చిన తర్వత సినిమా గ్రాఫ్…
అలా అలా పెరుగుతూ పోతుంది…ఇక లాస్ట్ 35-40 నిమిషాలు సినిమాకి మేజర్ బూస్టప్ ఇచ్చింది అని చెప్పాలి. మొత్తం దైవభక్తితో హీరో ఎలా మారాడు అన్న సీన్స్ అండ్ సినిమా మెయిన్ థీమ్ అయిన హీరో తన కళ్ళని శివుడికి అర్పించే సన్నివేశాలు అన్నీ కూడా ఎమోషనల్ గా కదిలిస్తూనే మంచు విష్ణులో ఒక మంచి నటుడు ఉన్నాడని చూపించాయి…
ఆ చివరి 35-40 నిముషాలు సినిమా మీద అప్పటి వరకు ఉన్న మిక్సుడ్ ఫీలింగ్స్ ని కొంచం పాజిటివ్ గా మార్చి ఒక డీసెంట్ మూవీనే ఓవరాల్ గా చూశాం అన్న ఫీలింగ్ ని కలిగిస్తాయి అని చెప్పాలి…మంచు విష్ణు తన రోల్ వరకు బాగా నటించాడు. వారియర్ లుక్ అంతగా సెట్ అవ్వలేదు అనిపించినా…
క్లైమాక్స్ పోర్షన్ నటుడిగా తన కెరీర్ బెస్ట్ అని చెప్పాలి. ఇక ప్రభాస్ ఉన్నది తక్కువే అయినా ఆ రోల్ ఇంపాక్ట్ చాలా బాగుంది…మిగిలిన స్పెషల్ రోల్స్ లో అక్షయ్ కుమార్ పర్వాలేదు అనిపించగా మోహన్ లాల్ మరియు మోహన్ బాబుల డైలాగ్స్ అండ్ సీన్స్ బాగానే మెప్పించాయి. హీరోయిన్ ఓకే అనిపించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు.
సినిమాకి సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా వరకు ప్లస్ అయింది, పాటలు పర్వాలేదు అనిపించగా బ్యాగ్రౌండ్ స్కోర్ సెకెండ్ ఆఫ్ లాస్ట్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో చాలానే ట్రిమ్ చేసే అవకాశం ఉంది కానీ చేయలేదు. సెకెండ్ ఆఫ్ వరకు బాగానే ఉంది కానీ…
ఫస్టాఫ్ ని ఇంకా ట్రిమ్ చేసి మరింత టైట్ స్క్రీన్ ప్లే తో రిలీజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది….సినిమాటోగ్రఫీ బాగుండగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్స్ లెంట్ గా ఉన్నాయి. డైరెక్షన్ పరంగా ఫస్టాఫ్ అండ్ స్క్రీన్ ప్లే మీద మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే బాగుండేది..
ఓవరాల్ గా ఇలాంటి డివోషినల్ టచ్ ఉన్న సినిమాలు మంచి స్టార్ కాస్ట్ తో రావడం చాలా అరుదు కాబట్టి మరీ రెగ్యులర్ మూవీస్ లా కాకుండా వీటిని చూసే దృష్టి కోణంలో చూస్తె కొంచం పడుతూ లేస్తూ సాగినా చివరి 35-40 నిముషాలు సినిమా కి బాగా హెల్ప్ అవ్వడంతో ఆడియన్స్ ఓవరాల్ గా…
సినిమా ఎండ్ అయ్యే టైంకి ఒక డీసెంట్ మూవీ చూసిన ఫీలింగ్ తోనే బయటికి రావడం ఖాయం…ఇవన్నీ పరిగణలోకి తీసుకుని సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…. ఫస్టాఫ్ అండ్ స్క్రీన్ ప్లే విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని ఉంటే ఇంకా బెటర్ గా ఉండేది సినిమా…