Home న్యూస్ కన్నప్ప టీసర్ 2 రివ్యూ…..ఇది అస్సలు ఊహించలేదు సామి!!

కన్నప్ప టీసర్ 2 రివ్యూ…..ఇది అస్సలు ఊహించలేదు సామి!!

0

రీసెంట్ టైంలో సినిమాల విషయంలోనే కాదు బయట విషయాల్లో కూడా అనుకోకుండా ఎక్కువ ట్రోల్స్ ను సొంతం చేసుకుంటూ ఉన్న హీరోలలో ముందు నిలిచే మంచు విష్ణు(Manchu Vishnu) నటిస్తున్న లేటెస్ట్ మూవీ తన కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతూ ఉండగా కన్నప్ప(Kannappa) ఎప్పటి నుండో షూటింగ్ ను జరుపుకుంటూ…

ఎట్టకేలకు సినిమా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఏప్రిల్ 25న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…సినిమా అఫీషియల్ టీసర్ రిలీజ్ అయినప్పుడు, అలాగే ఇతర పోస్టర్ లు లాంటివి వచ్చి భారీగానే ట్రోల్ స్టఫ్ గా నిలిచినప్పటికీ కూడా…

ఇప్పుడు సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవ్వగా ఇప్పుడు లేటెస్ట్ గా సినిమా నుండి రెండో టీసర్ ను రిలీజ్ చేయగా…ఈ టీసర్ ఎక్స్ లెంట్ క్వాలిటీతో భారీ ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ స్టార్ కాస్ట్ తో ఓ రేంజ్ లో మెప్పించింది అని చెప్పాలి…

కథ పాయింట్ ను కూడా కొద్ది వరకు రివీల్ చేయగా…..ఊరి మీద అనేక మంది యుద్దానికి సిద్ధం అవుతున్న వేల తమని కాపాడటానికి ఎవరు వస్తారు అని జనాలు ఎదురు చూస్తున్న టైంలో వేల మంది వచ్చినా లక్షల మంది వచ్చినా ఏం కాదంటూ హీరో వస్తాడు…..

ఆ తర్వాత కథ ఏమయింది…..నాస్తికుడు అయిన హీరోకి దైవ భక్తీ ఎలా మొదయ్యి శివున్ని ఎలా ఆరాధించాడు అన్న కథనే కన్నప్పగా చెప్పబోతున్నట్లు తెలుస్తుంది. టీసర్ అంతా భారీ స్టార్ కాస్ట్ తో మెప్పించగా…అంతా ఒకెత్తు అయితే టీసర్ ఎండ్ లో రెబల్ స్టార్ ప్రభాస్…

రుద్ర రోల్ లో మెస్మరైజింగ్ స్క్రీన్ ప్రజెన్స్ తో అండ్ రిమార్కబుల్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో మెప్పించగా…ఆ ఒక్క షాట్ తో సినిమా మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి అని చెప్పాలి. ముందు ట్రోల్ స్టఫ్ లా అనిపించినా సెకెండ్ టీసర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలను మరింతగా పెంచేసింది. ఇక సినిమా ఇదే రేంజ్ లో ఉంటే మినిమమ్ ఇంపాక్ట్ ను కలెక్షన్స్ రూపంలో సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here